Medchal: రాత్రి పూట రహస్యంగా మేకలు, గొర్రెల నుంచి రక్త సేకరణ .. ముఠా అరెస్ట్

మేడ్చల్‌లో టీవీ9–పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో సంచలన విషయం వెలుగుచూసింది. రహస్యంగా మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మటన్ షాప్ ముసుగులో అక్రమంగా రక్తం సేకరించి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 180 రక్త ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Medchal: రాత్రి పూట రహస్యంగా మేకలు, గొర్రెల నుంచి రక్త సేకరణ .. ముఠా అరెస్ట్
Animal Blood Racket

Updated on: Jan 04, 2026 | 12:53 PM

మేడ్చల్‌లో టీవీ9, పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. రక్తం సేకరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కీసర పీఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తుంది ఈ ముఠా. మటన్ షాప్‌లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నారు. మటన్ షాప్ యజమాని సోనూతో పాటు.. నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజయ్‌ అరెస్ట్ చేశారు. 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

రాత్రిపూట రహస్యంగా మేకలు, గొర్రెల నుంచి రక్త సేకరిస్తున్నారు నిందితులు. ఆదివారానికి ఒకరోజు ముందు రక్తాన్ని సేకరించిన తర్వాత మటన్‌ షాప్‌లకు మూగజీవాలను తరలిస్తున్నారు. అనుమతి లేకుండా మూగజీవాల రక్తాన్ని ఎందుకు సేకరిస్తున్నారు?. హ్యూమన్‌ బ్లడ్‌ అని రాసి ఉన్న ప్యాకెట్లను ఎందుకు వాడుతున్నారు?. నిబంధనలను, నైతికతను గాలికొదిలేసి బ్లడ్‌ బిజినెస్‌ చేస్తున్నారా?,.. ఏడాదిగా గుట్టుచప్పుడు కాకుండా దందా వెనుక ఎవరున్నారు?. రక్తం దందాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి