Hyderabad: అటెన్షన్ హైదరాబాదీస్.! డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగం ఊస్టే

మద్యం సేవించి పట్టుబడితే ఇక మీ ఉద్యోగం ఊస్టే..! హైదరాబాద్ యువతకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిపై కేవలం జరిమానాతో సరిపెట్టకుండా.. వారి ఉద్యోగ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడేలా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: అటెన్షన్ హైదరాబాదీస్.! డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగం ఊస్టే
Traffic Police

Edited By:

Updated on: Feb 04, 2026 | 11:25 AM

మద్యం సేవించి పట్టుబడితే ఉద్యోగం ఊడిపోవడం ఖాయమని నగర ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిపై కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, వారి ఉద్యోగ భవితవ్యంపై కూడా ప్రభావం పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పలువురు ఉద్యోగులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారు. కోర్టులో కేసులు నమోదు కావడంతో పాటు, వారి ఉద్యోగ సంస్థలకు సమాచారం పంపే ప్రక్రియ కొనసాగుతోందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దోషులుగా తేలితే జరిమానాతో పాటు జైలు శిక్ష, లైసెన్స్ రద్దు లాంటి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, కంపెనీ పాలసీల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదైన ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. పండుగలు, వీకెండ్లు, పెళ్లిళ్లు వంటి సందర్భాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమే కాకుండా, తమ భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్టేనని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేవలం ప్రాణాలకే కాదు.. ఉద్యోగం, కుటుంబ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..