TGSRTC : హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మరో 150 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు!

హైదరాబాద్‌ వాసులకు తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు త్వరలోనే మరో 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో దాదాపు 150 ఎలక్ట్రిక్‌ బస్సులే ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

TGSRTC : హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మరో 150 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు!
New Buses

Updated on: Apr 26, 2025 | 12:37 PM

రోజురోజుకు హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో సుమారు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో ఈ పెరిగిన రద్దీని తగ్గించేందుకు.. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 95 నుంచి 100 శాతానికి చేరుకుంది. దీంతో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింత మందిని ఆకర్షించాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈక్రమంలో ఇప్పటికి 200 బస్సులను తీసుకురావాలని నిర్ణయించగా.. 2025 నాటికి దాదాపు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నటుకుంది. ఎలక్ట్రిక్ బస్సులు వాడకంతో ప్రజలకు సౌకర్యంతో పాటు.. ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…