
ఏటా ఎన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడుతోంది. ఈ ఒక్క లెక్క తీస్తే చాలు.. మత్తు వాడకం పెరుగుతోందా తగ్గుతోందా చెప్పుయొచ్చు. 2023లో జప్తు చేసిన డ్రగ్స్ వాల్యూ 94 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్.. 139 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ నవంబర్ వరకు దాదాపు 173 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. సో, ఏటికేడు డ్రగ్స్ వినియోగం పెరుగుతోందనే అర్థం. ఎట్ ద సేమ్ టైమ్.. పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు కాబట్టే, ఎక్కడ డ్రగ్స్ గుప్పుమన్నా వాలిపోతున్నారు కాబట్టే డ్రగ్స్ కేసులు పెరిగాయ్, పట్టుబడిన మాదకద్రవ్యాల విలువా ఎక్కువే ఉంది. మామూలు పార్టీలు, సెలబ్రేషన్స్ టైమ్‌లోనే డ్రగ్స్ వాడుతున్న హిస్టరీ ఉంది మన దగ్గర. చాలా సందర్భాల్లో పట్టుబడ్డ ఇన్సిడెంట్స్ ఉన్నాయ్ మన కళ్ల ముందర. అలాంటిది.. న్యూ ఇయర్ వేడుకల్లో నిషా ఉండకుండా ఉంటుందా? పార్టీ అంటే లిక్కర్ కామన్. అందులో కిక్ ఏముంటుందనుకుంటున్న డ్రగ్స్ గ్యాంగ్స్.. ఈసారి గట్టిగానే పీల్చాలని అనుకుంటుంటారు. బట్.. ఈ డిసెంబర్ 31stని ‘జీరో డ్రగ్స్’గా సెలబ్రేట్ చేసుకునేలా చేయబోతున్నాం అంటున్నారు పోలీసులు. అసలు రింగ్‌రోడ్ దాటి సిటీలోకి ఒక్క గ్రాము డ్రగ్స్ రాకుండా కాపలా కాస్తున్నారు. ఆల్రడీ ఆ ఆపరేషన్ మొదలైంది. కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. నిఘా వ్యవస్థను ఫుల్‌గా యాక్టివేట్ చేశారు. సిటీ పరిధిలో ఎక్కడైనా, ఎవరైనా ‘డ్రగ్స్’ అనే వర్డ్ పలికినా...