కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ లో వాడే పదాల్లోని కొన్నింటిని లోక్ సభ(Lok Sabha) నిషేధించింది. వాటిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇదా.. మీ భాష? అంటూ కొన్ని వ్యాఖ్యలను చెప్తూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నిరసనకారులను ఆందోలన్ జీవి అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన ‘80-20’ ఓకేనా? మహాత్మా గాంధీని బీజేపీ ఎంపీ కించపరిచిన తీరు బాగానే ఉందా? రైతు నిరసనకారులను ఉగ్రవాదులు అని అవమానించడం సరైందేనా..?‘గోలీ మారో..’ అంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం..’’ ఇవన్నీ సరైనవా..? అని కొన్ని వాక్యాలను ఉదాహరిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
లోక్ సభ నిషేధిత పదాల జాబితాలో సిగ్గులేదు, ధోకేబాజ్, అసమర్థుడు, నాటకం, నటన, అవినీతి పరుడులాంటి మరిన్ని పదాలను జత చేసింది. కరప్ట్, కవర్డ్, హూలిగనిజం, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, క్రొకొడైల్ టియర్స్, బ్లడ్‌షెడ్, డాంకీ, డ్రామా, అప్‌మాన్, కాలా బజారీ, చంచా, చంచాగిరి, అబ్యూస్డ్, చీటెడ్, క్రిమినల్, గూన్స్, దలాల్, దాదాగిరీ, లాలీపాప్, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, బేహ్రీ సర్కారు, బాబ్‌కట్, జుమ్లాజీవీ, శకుని, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, ఐవాష్, అన్‌ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, గిర్గిట్, బేచారా, అసత్య, అహంకార్ వంటి ఇంగ్లీషు పదాలను నిషేధిత పదాల జాబితాలో చేర్చారు. నిషేధిత జాబితాలో ఉన్న పదాలను ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.
Parliamentary language of NPA Govt
✅ PM calling protesters “Andolan Jeevi” is fine
✅” Goli Maaron Saalon Ko” by Minister is okay
✅ “80-20” by UP Chief Minister is okay
✅ Denigration of Mahatma Gandhi by BJP MP is fine
✅ Farmer protesters insulted as “Terrorists” is fine pic.twitter.com/0Q4nfUmuET— KTR (@KTRTRS) July 16, 2022
అంతేకాకుండా పార్లమెంటులో ఆందోళనలు చేసేందుకు అనుమతి లేదని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులు ఎటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు లేదా ఏదైనా మతపరమైన వేడుకల కోసం పార్లమెంటు ఆవరణను ఉపయోగించకూడదని అందులో వివరించారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విటర్‌లో సెటైర్ వేశారు. విశ్వగురు నుంచి మరో కొత్త రూల్ వచ్చింది. ఇకపై ధర్నాపై నిషేధం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..