Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు.. హైదరాబాద్ రామచంద్రపురం ప్రాంతానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ రామినేని మహేష్ బాబు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన మహేష్ బాబు మృతి పట్ల అతని కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేష్ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు గుంటూరుకు చెందిన రామినేని మహేష్ బాబు 8 నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చి రామచంద్రపురంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి గ్యాస్ సిలిండ్ తీసుకొస్తానని బయల్దేరాడు. తన స్కూటీపైనే వెళ్లాడు.
ఈ క్రమంలోనే చందానగర్ మెయిన్ రోడ్ లో స్కూటీపై వెళ్తున్న మహేష్ ని మృత్యు శకటం రూపంలో వచ్చిన DCM వెహికల్ ఢీకొట్టింది దీంతో మహేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…