Hyderabad: పోకిరీల బెండు తీస్తున్న షీ టీమ్స్‌.. నిమజ్జనాల సందర్భంగా ఎంతమంది పట్టుబడ్డారో తెలిస్తే..

హైదరాబాద్‌ నగరంలో గణేష్ నిమజ్జనాల సదర్భంగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పనిపట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టిన షీటీమ్స్ ఏకంగా 1612 మంది నేరస్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిలో 1,544 మంది మేజర్లు మరియు 68 మంది మైనర్లు ఉన్నారు. ఇందులో పలువురిపై కేసు నమోదు చేయగా.. మరి కొంత మందికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు పోలీసులు.

Hyderabad: పోకిరీల బెండు తీస్తున్న షీ టీమ్స్‌.. నిమజ్జనాల సందర్భంగా ఎంతమంది పట్టుబడ్డారో తెలిస్తే..
Telangana She Team

Updated on: Sep 10, 2025 | 10:14 PM

హైదరాబాద్‌ నగరంలో గణేష్ నిమజ్జనాల సదర్భంగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పనిపట్టేందుకు షీ టీమ్స్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రంగంలోకి దిగిన షీ టీమ్స్ బృందాలు.. నిమజ్జన వేడుక ప్రాంతాలలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు 1,612 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిలో 1,544 మంది మేజర్లు, 68 మంది మైనర్లు ఉన్నారు. నేరస్థులపై సంబంధిత చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేశారు. మళ్లీ ఇలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడవద్దని మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

మొత్తం 1,612 కేసుల్లో 168 కేసులు పెట్టీ కేసులుగా నమోదు కాగా, వాటిలో 70 కేసులలో నిందితులను ఇప్పటికే నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 10 కేసుల్లో రూ. 50/- జరిమానా, 59 కేసుల్లో రూ. 1,050/- జరిమానా మరియు (1) కేసులో 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. మిగిలిన 98 పెట్టీ కేసులను త్వరలోనే కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. అదనంగా, 1,444 మంది వ్యక్తులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.

షీ టీమ్స్ హెచ్చరికలు

నకిలీ ప్రొఫైల్‌ల పట్ల జాగ్రత్త: మోసగాళ్ళు తరచుగా మిమ్మల్ని నమ్మించడానికి నకిలీ ప్రొఫైల్‌లను సృష్టిస్తారు. కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తులతో మాట్లాడేప్పుడు వాళ్ల గుర్తింపును కచ్చితంగా ధృవీకరించండి.

అతిగా షేర్ చేయడాన్ని నివారించండి: సోషల్ మీడియాలో మీరు షేర్ చేసే వ్యక్తిగత సమాచారాన్ని అతిగా షేర్ చేయడం ఆపేయండి. మోసగాళ్ళు ఈ సమాచారాన్ని ఉపయోగించి మీలా నటింటి ఏవైనా దొంగతనాలకు పాల్పడవచ్చు.

మీ ఖాతాలను భద్రపరచండి: మీ ఖాతాలకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి, భద్రతను పెంచడానికి సాధ్యమైన చోట రెండు కారకాల ప్రామాణీకరణను ప్రారంభించండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.