Hyderabad Kids Athletics Championships- 2022: ఆటల్లో చిన్నారుల ప్రతిభను వెలికితీయడంలో భాగంగా హైదరాబాద్‌లోని ‘ది అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో హైదరాబాద్ కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2022 పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అండర్-7 బాలబాలికలకు (30 మీటర్లు, 80 మీటర్లు), అండర్-9 వారికి (50 మీటర్లు, 100 మీటర్లు), అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్‌కు (80 మీటర్లు, 300 మీటర్లు, 600 మీటర్లు), అండర్ -13 విద్యార్థులకు(100మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు) ఇలా వేర్వేరు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల వారు నేరుగా నిర్వాహకులను సంప్రదించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కాగా హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని సత్తాచాటుతున్నారు. ఈక్రమంలో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల రుత్విక్ కిడ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపాడు. అండర్-7 విభాగంలో 30 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఈ బుడతడు.. మొదటి స్థానంలో నిలిచాడు. తద్వారా మెడల్‌తో పాటు ప్రశంసాపత్రం అందుకున్నాడు. కాగా రన్నింగ్ రేస్‌లంటే ఆసక్తి చూపుతోన్న రుత్విక్ చాలా రోజుల నుంచి సాధన చేస్తున్నాడు. వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అందులో భాగంగానే కిడ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపాడు. మరి రాబోయే రోజుల్లో ఈ బుడతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
Also Read:Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’
White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..
Tamilnadu: చనిపోయాడని పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే.. 24 గంటల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు..