TSRTC: బంపరాఫర్ ప్రకటించిన ఆర్టీసీ.. ఆ రోజుల్లో విద్యార్థులకు ఫ్రీ జర్నీ

ఆర్టీసీ(RTC) ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేయాలనే సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పండుగలు, సెలవు రోజులు....

TSRTC: బంపరాఫర్ ప్రకటించిన ఆర్టీసీ.. ఆ రోజుల్లో విద్యార్థులకు ఫ్రీ జర్నీ
Tsrtc Md Sajjanar
Follow us

|

Updated on: May 20, 2022 | 11:32 AM

ఆర్టీసీ(RTC) ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేయాలనే సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పండుగలు, సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో బస్సు ప్రయాణానికి రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తూ అభిమానాన్ని చూరగొంటున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రయాణికుల నుంచి అందే వినతులు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 23 నుంచి జరిగే టెన్త్(Tenth Exams in Telangana) ఎగ్జామ్స్ దృష్ట్యా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. విద్యార్థులు ప్రస్తుతం కలిగి ఉన్న బస్ పాస్ వ్యాలిడిటీని జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.

విద్యార్థులు తమ బస్ పాస్ తో పాటు హాల్ టికెట్ చూపించి పరీక్షల రోజుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రానికి, అక్కడి నుంచి గమ్యస్థానానికి తిరుగు ప్రయాణం చేయవచ్చని వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రం ఎక్కడ ఉన్నా.. అక్కడి వరకు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం విద్యార్థులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

YS Jagan: పెట్టుబడులే లక్ష్యంగా.. దావోస్‌కు బయలుదేరిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్..

Dog: ఎయిర్‌పోర్టు అధికారుల్ని పరిగెత్తించిన శునకం.. వీడియో చూడటానికి ఫన్నీగా ఉన్నా.. అధికారులు మాత్రం..