Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలెర్ట్ జారీ చేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert

Updated on: Nov 23, 2023 | 10:18 AM

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలెర్ట్ జారీ చేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలెర్ట్

గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట, చిలుకలగూడ, ప్యాట్ని, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్‌, కైపర, ఈసీఐఎల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప.. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాల పడతాయని సూచించారు వాతావరణ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..