అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ? అజ్ఞాతం వెనుక అసలు కతేంటి? బెట్టింగ్‌యాప్ గోతులు ఆరోపణలు ఎలా వున్నా క్రియేటివ్ వీడియోలతో నీతులు చెప్పే హర్షసాయికి ఆరోపణలు వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాలన్న విషయం తెలియదా? అన్నది బిగ్ క్వశ్చన్. క్రేజీ వీడియోలతో పాటు హర్షసాయిపై ఆరోపణలకు కొదవలేదు ఇక రీసెంట్‌గా నార్సింగ్ పీఎస్‌లో అతనిపై రేప్ కేసు ఫైలయింది. స్టోరీ డిస్కషన్ పేరిట ఇంటికి పిలిచి..మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి..అత్యాచారం చేశాడని.. వీడియో రికార్డ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తీశారు. ఆ మూవీ కాపీ రైట్స్ కోసం పక్కా ప్లాన్‌తో ఇవన్నీ చేశాడని.. వీడియోలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడని ఆరోపించారామె. ఐతే అవన్నీ నిరాధార ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మరి అతను చెప్పిందే నిజమైతే దాగుడుమూతలెందుకు? అనే చర్చ జరుగుతోంది.
అజ్ఞాతంలోకి వెళ్లడమంటే నేరానికి అర్ధాంగీకారం అంటారు. మరి హర్షసాయి అండ్‌గ్రౌండ్‌లోకి వెళ్లడం దేనికి సంకేతం.? ఐనా అతను దొరకట్లేదా? లేదంటే ఖాకీలు అతన్ని ట్రేస్ చేయలేకపోతున్నారా?..ఎనకటి రోజులు కావివి. ఏమూలన నక్కినా ఇట్టే పసిగట్టే టెక్నో పోలీసింగ్ ఉందిప్పుడు. రీసెంట్‌గా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు పోలీసులు. మరి హర్షసాయి విషయంలో ఎందుకని ఇంత జాప్యం?..పైగా హర్షసాయి సోషల్ మీడియోలు పోస్టులు, ఆడియో లీకులు ఇస్తూనే ఉన్నాడు. లేటెస్ట్‌గా మరో ఆడియో రిలీజ్ చేశాడు.
ఫిబ్రవరిలో ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రిలీజైంది. కళ్లు కృష్ణుడిలా వున్నాయన్న ఆమె కితాబుకు కితకితలాడిపోయి ఆ ఆడియోను భద్రంగా సేవ్ చేసుకున్నాడా? నేటి పొగడ్తే రేపటి తెగడ్త అవుతుందనే ముందు చూపుతోనా? ఆడియో ఫైల్స్‌ను అంత జాగ్రత్తగా చేసుకున్నాడంటే కీడెంచి మేలెంచాలనే లైనా? ఏదైనా క్రిమినల్ ఇంటెన్షన్ వుందా? తనపై వచ్చిన ఆరోపణలు నిరాధరమైతే…తనకు తాను నిర్దోషిగా భావిస్తే ఎందుకని ఈ దాగుడు మూతలు. ? అన్నది ప్రశ్నార్థకం.
కంప్లేంట్ ఇచ్చిన యువతితో కలిసి మెగాలో డాన్ అనే మూవీ చేసిన హర్షసాయి.. ఆమె ఇచ్చిన కంప్లేంట్ ఎదుర్కునేందుకు తన తరపున అడ్వోకేట్ చిరంజీవిని దింపాడు. కేవలం డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తుందనేది హర్షసాయి అభియోగం.నిజంగా అది నిజమైతే.. మరి ఎందుకని ఫ్యామిలీకి ఫ్యామిలీ పరారయ్యారో పోలీసులే తేల్చాలి.
ఎక్కడో నక్కి పోస్టులు..ఆడియో లీకు ఇవ్వడం వెనుక హర్షసాయి స్ట్రాటెజీ ఏంటి? తను సీన్‌లోకి రాకుండా పోలీసులకు సవాల్ విసురుతున్నాడా? అడ్వోకేట్ అన్ని చూసుకుంటాడని స్టేట్‌మెంట్ ఇచ్చాడంటే డబ్బుంటే ఏదైనా చేయోచ్చని సభ్య సమాజానికి సందేశమిస్తున్నాడా? ఇలా అనేక రకాల చర్చలు జరుగున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.