
PM Modi in Hyderabad Highlights: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు ఐదు గంటల పాటు నగరంలో గడపనున్న ప్రధాని, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి,మోదీ మధ్య HICCలో సున్నితమైన సంవాదం జరిగింది. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌కి ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. అయితే దీనికి మోదీ స్పందిస్తూ గుజరాత్‌కి ఆ రోజు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకుఅంత ఇస్తే.. వచ్చేది మేము ఇవ్వాలనుకుంటున్నదానిలో సగమే వచ్చే అవకాశం ఉందని మోదీ అన్నారు.
ఆ రోజు గుజరాత్‌కి చేసిన కేటాయింపులకు రెట్టింపు అని, తెలంగాణకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అందుకే మాతో కలవండి అంటూ రేవంత్‌రెడ్డికి నవ్వుతూ ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సంకోభంలో ఉందని, విదేశీ ప్రయాణాలను ప్రస్తుతానికి మానుకోవడం ద్వారా దేశ సంపద బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని మోదీ తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలుతో కూడిన సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆకాంక్షించారు.
బంగారం, రాగి కొరతపై మోదీ కీలక సూచనలు చేశారు. దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ప్రజలు బంగారం కొనడం ఆపివేయాలని కోరారు. గతంలో యుద్ధ సమయాల్లో దేశం కోసం ప్రజలు బంగారం దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే దేశంలో రాగి (Copper) కొరత తీవ్రంగా ఉందని, వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలని ప్రధాని కోరారు. ఆడంబరాలు వద్దని, అనవసరమైన దుబారా ఖర్చులు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉందని, సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రధాని మోదీ సూచించారు. పర్యావరణ హితమైన, పొదుపైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. ఆఫీసులకు వెళ్లడం తగ్గించి, వీలైనంత వరకు ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’, ‘ఆన్‌లైన్ మీటింగ్‌లు’ నిర్వహించుకోవాలని సూచించారు. ఇది ఇంధన ఆదాకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగం, విదేశీ మారక ద్రవ్యం ఆదా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఇక్కడ కూడా మావోయిస్టులను అంతం చేస్తామన్నారు. తెలంగాణలో మావోయిస్టులను అంతం చేయాలని బీజేపీ పాలన రావాలని అన్నారు. ప్రపంచం ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను ఎదర్కొంటోందని పేర్కొన్నారు.
దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా అబద్దాలతోనే పాలన సాగిస్తోందన్నారు. కాంగ్రెస్ మావోయిస్టు పార్టీగా మారిందన్నారు. ముస్లింలీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ మారిందని అన్నారు. మావోయిస్ట్‌ల హింసతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. దేశమంతా మావోయిస్టులు అంతమైనా తెలంగాణలో ఇంకా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదన్నారు.
దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా అబద్దాలతోనే పాలన సాగిస్తోందన్నారు. కాంగ్రెస్ మావోయిస్టు పార్టీగా మారిందన్నారు. ముస్లింలీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ మారిందని అన్నారు. మావోయిస్ట్‌ల హింసతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అన్నారు. జహీరాబాద్‌లోఇండస్ట్రియల్ కారిడాయర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇండస్ర్టియల్ కారిడార్, టెక్స్‌టైల్ పార్క్‌తో ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ పత్తి రైతుల జీవితాలను మార్చేస్తుందన్నారు.
హైదరాబాద్‌ను అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోందన్నారు. ఒకప్పుడు కార్యకర్తలులేని బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో మాకు లోక్‌సభలో 2 సీట్లే ఉన్నప్పుడు ఒకటి తెలంగాణ నుంచి గెలిచామని గుర్తు చేశారు.
బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు కాదు.. విశ్వాస రాజకీయాలను ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు.
ఒకప్పుడు దక్షిణాధిలో, ఈశన్యంలో బీజేపీని అంటరాని పార్టీగా చూశారని, తెలంగాణ యువత ప్రేమ నా కళ్లతో చూస్తున్నానని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోందన్నారు.
దేశంలో ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. బెంగల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని అన్నారు. మమత నియంతృత్వాన్ని బెంగాల్ ప్రజలు ఎదిరించారని అన్నారు.
ప్రధాన నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తున్నారు. ముందుగా నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటే మోదీ తెలుగులో ప్రసంగించారు మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా మోదీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. మోదీ సభకు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో చంద్రబాబుతో మోదీ భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబుతో భేటీకి ముందు పవన్ కల్యాణ్ ఇంటికి మోదీ వెళ్లారు. చంద్రబాబు, పవన్‌తో మోదీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాన నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
మల్కాపూర్‌లో IOC గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ పర్యటనలో భాగంగా వర్చువల్‌గా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి పనులు, కాజీపేటలో రైల్ అండర్ రైల్ బైపాస్ లేన్ పనులను ప్రారంభించారు.
Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని చంద్రబాబాబు నివాసానికి వెళ్లారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రధానికి చంద్రబాబు స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా గచ్చిబౌలిలోని సింధు ఆస్పత్రిని ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలోని సదుపాయాల గురించి, అధునాత టెక్నాలజీ గురించి ఆస్పత్రి సిబ్బంది మోదీకి వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యనటలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్‌ను మోదీ పరామర్శించారు.
దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. హైదరాబాద్ పర్యనలో భాగంగా HICCలో పలు అభివృద్ధి పనులను వర్చవల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. సైబరాబాద్ అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయని అన్నారు. రూ.9,377 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి,మోదీ మధ్య HICCలో సున్నితమైన సంవాదం జరిగింది. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌కి ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. అయితే దీనికి మోదీ స్పందిస్తూ గుజరాత్‌కి ఆ రోజు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకుఅంత ఇస్తే.. వచ్చేది మేము ఇవ్వాలనుకుంటున్నదానిలో సగమే వచ్చే అవకాశం ఉందని మోదీ అన్నారు.
ఆ రోజు గుజరాత్‌కి చేసిన కేటాయింపులకు రెట్టింపు అని, తెలంగాణకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అందుకే మాతో కలవండి అంటూ రేవంత్‌రెడ్డికి నవ్వుతూ ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడబోనని అంటున్నారని, నేను కూడా రాజకీయాలు మాట్లాడటం లేదని ప్రధాని అన్నారు. పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇస్తామని వెల్లడించారు. అలా చేస్తే ఇప్పుడు ఇచ్చే దాంట్లో సగం నిధులేమికు వస్తాయా..? అవే చాలా అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ HICC నుంచి గచ్చిబౌలికి బయలుదేరి వెళ్లారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మోదీ ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా కాకతీయ టెక్స్‌టైల్‌ను ప్రారంభించారు. గుడెబలలూర్-మహబూబ్‌నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా మోదీ శంకస్థాపన చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణను నెంబర్‌వన్ చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి పెట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారు మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించారని, తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చారని కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోదీని శాలువాతో సత్కరించారు. మోదీకి నంది జ్ఞాపికను అందించారు సీఎం రేవంత్. అలాగే మోదీకి శ్రీరాముడి ప్రతిమను బహుకరించారు మంత్రి కిషన్‌రెడ్డి.
Modi
కొద్దిసేపటి క్రితమే బేగం పేట్ కు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గవర్నర్ శుక్లాలు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి నేరుగా మోదీ HICCకి బయలుదేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరారు. కాసేపట్లో అభివృద్ది పనులకు శంకస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి భట్టి విక్రమర్క స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని HICCకి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ విమనాశ్రయానికి చేరుకున్నారు. మోదీని తెలంగాణ మంత్రులు పొన్న ప్రభాకర్, భట్టి విక్రమార్క, అలాగే అజారుద్దీన్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అలాగే మోదీ కొద్దిసేపట్ల HICCకి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో కాస్త ఆలస్యం అవుతున్నట్లు ప్రధాని తెలంగాణ సీఎం కార్యాలయానికి సమాచారం అందించింది. అర గంట పాటు ఆలస్యంగా మోదీ రానున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నందు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం ఒంట గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. మోదీకి బీజేపీ ముఖ్యనేతలు ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోదీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.
మరికాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. మోదీని బీజేపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు.