Hyderabad: ఫలక్‌నుమాలో దసరా వేడుకలు.. ఫలక్‌నుమాలో రావణ దహనం ఎలా జరిగిందంటే..

విజయం పై ధర్మం సాధించిన విజయదశమి ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పండగ వాతావరణం సందడిగా మారింది. కుటుంబాలతో కలిసి హాజరైన ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తూ, విజయదశమిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పాతబస్తీలోని ఫలక్‌నుమా జంగం మెట్ లో శ్రీ కృష్ణ బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 86 సంవత్సరాలుగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు.

Hyderabad: ఫలక్‌నుమాలో దసరా వేడుకలు.. ఫలక్‌నుమాలో రావణ దహనం ఎలా జరిగిందంటే..
Ravana Dahanam

Updated on: Oct 03, 2025 | 7:45 AM

హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమాలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఫలక్‌నుమా మల్లికార్జున దేవాలయంలో విజయదశమి సందర్భంగా జరిగిన రావణ దహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి వేళ ఆకాశాన్ని అలరించిన పటాకుల కాంతుల మధ్య, రావణ వధను ప్రతిబింబించే విధంగా ప్రతిమను దహనం చేశారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు.

వీడియో ఇక్కడ చూడండి..

విజయం పై ధర్మం సాధించిన విజయదశమి ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పండగ వాతావరణం సందడిగా మారింది. కుటుంబాలతో కలిసి హాజరైన ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తూ, విజయదశమిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పాతబస్తీలోని ఫలక్‌నుమా జంగం మెట్ లో శ్రీ కృష్ణ బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 86 సంవత్సరాలుగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..