అవునంటే.. వద్దంటున్నారు.. అమావాస్య అడ్డంటున్నారు.. ప్రమాణ స్వీకారంపై పార్టీల తిరకాసు

|

Jan 27, 2021 | 8:08 PM

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి...

అవునంటే.. వద్దంటున్నారు.. అమావాస్య అడ్డంటున్నారు.. ప్రమాణ స్వీకారంపై పార్టీల తిరకాసు
Follow us on

Oath of Newly-Elected GHMC : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

కార్పొరేటర్ల ప్రమాణం అయ్యాక అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ రోజు కుదరకపోతే మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. ఆ రోజు సెలవు ఉన్నా ఎన్నిక నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ఎన్నికలసంఘం ప్రకటించింది.

ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా.. ఫిబ్రవరి 11 పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బీజేపీ . నిండు అమావాస్య రోజున ప్రమాణ స్వీకారం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ప్రజల విశ్వాసాలపై నమ్మకం లేని ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీలో బాగంగానే ఈ నిర్ణయం జరిగిందని… ప్రమాణ స్వీకారం తేదీ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

ప్రమాణ స్వీకారానికి మహూర్తం విషయంలో బీజేపీ నేతల ఆరోపణలపై టీఆర్ఎస్ మండి పడుతోంది. పాలకమండలి ఏర్పాటు, కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం పై నానా యాగీ చేసిన బీజేపీ… ఎన్నికల కమిషన్ పెట్టిన మహూర్తంపై తమను నిందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఎలాగూ మేయర్ పీఠం దక్కదు కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, ఏ పార్టీకి లేని అమావాస్య బీజేపీకే ఎందుకు ఉంటుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు… మహూర్తం విషయంలో పట్టు పడుతున్న బీజేపీ కార్పోరేటర్లు.. ఫిబ్రవరి 11న ప్రమాణం చేస్తుందా.. లేక సెంటిమెంట్‌ను గౌరవిస్తూ.. తర్వాత మరో మహూర్తం చూసుకుంటుందా అనేది ఆసక్తికరమైన అంశం.

ఇవి కూడా చదవండి :

ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్.. రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో ఎన్‌‌‌బీడబ్ల్యూ జారీ

Dalal Street Crash : దేశీయ మార్కెట్లు మరోసారి ఢమాల్.. కేంద్ర బడ్జెట్‌కు ముందు భారీ లాస్..

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత షట్లర్‌కు చుక్కెదురు.. నిరాశే మిగిల్చిన పీవీ సింధు