Neera Cafe: చిల్ అయ్యే న్యూస్.. నేటినుంచి అందుబాటులోకి నీరా కేఫ్.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్..
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యాధునికంగా నిర్మించిన మొట్టమొదటి నీరా కేఫ్ ఇవ్వాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డులో సుమారు రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నీరా కేఫ్‌ను బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యాధునికంగా నిర్మించిన మొట్టమొదటి నీరా కేఫ్ ఇవ్వాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డులో సుమారు రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నీరా కేఫ్‌ను బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. రూ.20 కోట్లతో నక్లేస్ రోడ్డులో ఈ నీరా కేఫ్‌ను అద్భుతంగా ప్రభుత్వం నిర్మించింది. దీంతో హైదరాబాద్‌కు మరో అదనపు ఆకర్షణ వచ్చినట్లయింది. ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం, పక్కనే కొత్త సచివాలయం.. అలాగే అమరవీరుల స్మరక చిహ్నం ఇలా అన్ని కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు ఈ నీరా కేఫ్ కూడా ఈ పరిసరాల్లోనే నిర్మించారు. నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ‘నీరా కేఫ్’కు శ్రీకారం చుట్టింది.
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి ఈ కేఫ్‌లో విక్రయించనున్నారు. ఏక కాలంలో సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునే విధంగా ఈ కేఫ్‌లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎలాగైతే కల్లు తాగిన అనుభూతి వస్తోందో.. అలాగే ఈ కేఫ్‌లో తాటి, ఈత మొద్దుల నమూనాల్లో సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయడం విశేషం. అలాగే కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి కుండలు కట్టి.. అచ్చమైన గ్రామీణ వాతావరణాన్ని ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఇక నీరా కేఫ్ పైకప్పును కూడా తాటి ఆకుల మాదిరిగానే డిజైన్ చేయడం మరో విశేషం.
నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరిశీలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..