Motkupalli Narasimhulu on Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలంగాణ నేతలు మాట్లాడుతుండం ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న తెలంగాణ నాయకులపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఆదివారం ఎన్టీఆర్ సమాధి దగ్గర నివాళులర్పించిన మోత్కుపల్లి నర్సింహులు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు.. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయంత్రం 5 వరకు దీక్ష చేపట్టనున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమంటూ పేర్కొన్న మోత్కుపల్లి నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయాలనుకోచటం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే రాజకీయంగా జగన్‌కే నష్టమంటూ పేర్కొన్నారు. తాను త్వరలో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతానన్నారు. అయితే, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు కేవలం గంట పాటు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మోత్కుపల్లి దీక్ష కొనసాగుతోంది.
ఇదిలాఉంటే.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరం దగ్గరికి చేరుకున్న పోలీసులు.. కాల్వ శ్రీనివాసులును అరెస్టు చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..