Minister KTR: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. జంట రిజర్వాయర్ల ప్రారంభం.. బస్‌ టెర్మినాల్‌కు శంకుస్థాపన

Minister KTR: దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. శనివారం హైదరాబాద్‌ నగరంలో పల...

Minister KTR: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. జంట రిజర్వాయర్ల ప్రారంభం.. బస్‌ టెర్మినాల్‌కు శంకుస్థాపన
Follow us

|

Updated on: Jan 09, 2021 | 5:42 AM

Minister KTR: దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. శనివారం హైదరాబాద్‌ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎల్బీనగర్‌ సర్కిల్‌లో జలమండలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జంట రిజర్వాయర్లను మధ్యాహ్నం 12.30 గంటలకు కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ. 9.42 కోట్ల వ్యయంతో వాసవీనగర్‌, కొత్తపేటలో ఒక్కొక్క రిజర్వాయర్‌ను 2.5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో జలమండలి నిర్మించింది.

దాదాపు నగరవ్యాప్తంగా 88 వేల గృహాలకు కొత్త రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలవుతుందని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

బస్ టెర్మినల్‌ నిర్మాణానికి శంకుస్థాపన కాగా, ఎల్‌బీనగర్‌ వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో రూ.10కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతర్‌ జిల్లాల బస్సుల రాకపోకల కోసం ఈ బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ మీదుగా ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు రోజూ సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. సుమారు 680 మీటర్ల పొడవుతో అధునాతన బస్‌ బేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో హెచ్‌ఎండీఏ 3 బస్‌ బేలను నిర్మించనుంది.

Salute to Hyderabad traffic police: అపద్బంవులైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. కేవలం 32 నిమిషాల్లో ఉపిరితిత్తుల తరలింపు

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ