హైదరాబాద్‌లో పేలుళ్లు, ప్రకంపనల అలజడి..! ఇళ్ల నుంచి జనం పరుగులు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, లంగర్‌హౌస్‌, అత్తాపూర్‌ ప్రాంతాల్లో భారీ పేలుళ్లను పోలిన శబ్దాలు వినిపించాయి.. అంతేకాకుండా ప్రకంపనలు సైతం వచ్చాయి.. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ శబ్దాలకు కారణం పేలుళ్లా, భూప్రకంపనలా లేదా మరేదైనా ఘటననా అనేది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

హైదరాబాద్‌లో పేలుళ్లు, ప్రకంపనల అలజడి..! ఇళ్ల నుంచి జనం పరుగులు
Hyderabad Loud Sounds

Updated on: Oct 27, 2026 | 10:53 AM

హైదరాబాద్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది.. రాజేంద్రనగర్‌ పరిధిలో పేలుళ్లు, ప్రకంపనల అలజడి రేగింది.. అనూహ్యంగా 4చోట్ల ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి.. అంతేకాకుండా.. పేలుళ్లకు కొనసాగింపుగా భూప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. భూకంపం వల్ల పేలుళ్లా..! పేలుళ్ల వల్ల భూకంపమా..? ఏమైందో అర్థంకాక జనం పరుగులు తీశారు. రాజేంద్రనగర్, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, అత్తాపూర్ ఏరియాల్లో ఒక్కసారిగా పేలుళ్ల లాంటి శబ్దాలు.. ప్రకంపనలతో .. అంతా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి పరుగులు తీశారు.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Loading...
Unable to load recommendations.
Follow Us