నేటి నుంచి తెలంగాణలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి..!

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటో మొబైల్ షో రూములు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

నేటి నుంచి తెలంగాణలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2020 | 6:28 AM

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటో మొబైల్ షో రూములు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయని తెలిపిన కేసీఆర్.. మిగతా లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయని తెలిపారు. కేంద్రం విధించిన తాజా లాక్ డౌన్ గడువు ఈ నెల 17 తో ముగియనుండగా… కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని, వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగు వ్యూహం ఖరారు చేసి అమలు చేస్తామని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చే వారిపై కూడా ఆయన మాట్లాడారు. ‘‘విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు పరీక్షలు నిర్వహించాలి. వైరస్ ఉంటే ఆసుపత్రికి తరలించాలి. లేకుంటే హోమ్ క్వారంటైన్ లో ఉంచాలి. హైదరాబాద్ లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి. రైళ్ల ద్వారా తెలంగాణకు చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి’’ అని కేసీఆర్ ఆదేశించారు.

Read This Story Also: Breaking: హైదరాబాద్ నుంచి రానున్న ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్‌..!