IPL Match: ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్‌ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!

ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే చివరి ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్‌ కోసం టికెట్స్‌కు భారీ డిమాండ్ ఉండడంతో దాన్ని సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేసుకుంటున్నారని.. జనాలు అందరూ కేవలం అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే నకిలీ లింక్స్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.

IPL Match: ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్‌ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!
Hyderabad Police Warn Fans Against Fake Ticket Cyber Fraud

Edited By:

Updated on: May 16, 2026 | 12:51 PM

ఐపీఎల్ సందడి పెరుగుతున్న వేళ.. సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగారు. మే 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు టికెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. అదే అవకాశంగా తీసుకుని నకిలీ టికెట్ బుకింగ్ యాప్స్, వెబ్‌సైట్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్న వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా నకిలీ లింకులు, ఫేక్ యాప్స్ తెగ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. డిస్ట్రిక్ట్ అనే అధికారిక టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను పోలి ఉండేలా సైబర్ మోసగాళ్లు నకిలీ యాప్స్ రూపొందిస్తున్నారని.. అసలు యాప్‌లో ఉన్న లోగో, రంగులు, డిజైన్‌ను కాపీ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారని.. ఈ నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్ అసలైన వాటిలాగే కనిపించడం వల్ల చాలా మంది సులభంగా మోసపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ లింకులను ఓపెన్ చేసి డబ్బులు చెల్లిస్తే టికెట్లు రాకపోవడమే కాకుండా.. బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం కూడా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వచ్చే టికెట్ లింక్‌ను నమ్మొద్దని.. అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద యాప్స్ లేదా వెబ్‌సైట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సీపీ సజ్జనార్ సూచించారు. ఐపీఎల్ వంటి భారీ క్రీడా ఈవెంట్ల సమయంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రత్యేక నిఘా పెట్టినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. అభిమానులు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశతో ఫేక్ ఆఫర్లకు బలికావద్దని సూచించారు.

కాగా ఇప్పటికే 12 వేలకుపైగా ఫేక్ టికెట్లు విక్రయమైనట్లు గుర్తించిన పోలీసులు.. అ నేపథ్యంలోనే మ్యాచ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఒరిజినల్ టికెట్లు ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి గందరగోళం, గొడవలు జరగకుండా అదనపు బందోబస్తుతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us