Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

తిరిగి వెంటనే వారు కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని తెలిపింది యాజమాన్యం. తల్లితండ్రులు వచ్చేసరికి అనుషను గాంధీ ఆసుపత్రికి తరలించింది కాలేజి సిబ్బంది. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య
Inter Student Committed Suicide

Updated on: Oct 21, 2024 | 8:28 AM

హైదరాబాద్‌ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు ఇంటికెళ్లిన అనూషను ఆదివారం ఆమె తల్లిదండ్రులు హాస్టల్‌లో వదిలేసి వెళ్లారు. వారు హైదరాబాద్‌ దాటేలోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. తిరిగి వెంటనే వారు కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని తెలిపింది యాజమాన్యం. తల్లితండ్రులు వచ్చేసరికి అనుషను గాంధీ ఆసుపత్రికి తరలించింది కాలేజి సిబ్బంది. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us