Hyderabad: సిటీలో పెరిగిన ఎండలు.. స్విమ్మింగ్ పూల్స్‎కు ఫుల్ డిమాండ్.. గంటకు ఎంతంటే..

సమ్మర్ వచ్చిందంటే చాలు స్విమ్మింగ్ పూల్ అన్ని సందడిగా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ స్విమ్మింగ్ ఫూల్స్‎లో చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ఈత నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు నగరవాసులు. దీనితో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఈతగాళ్లతో కలకలాడుతున్నాయి. ఈత నేర్పించాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ పూల్‎కు తీసుకొస్తారు. సిమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం. ముఖ్యంగా వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‎పై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Hyderabad: సిటీలో పెరిగిన ఎండలు.. స్విమ్మింగ్ పూల్స్‎కు ఫుల్ డిమాండ్.. గంటకు ఎంతంటే..
Swimming Pools
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 3:41 PM

సమ్మర్ వచ్చిందంటే చాలు స్విమ్మింగ్ పూల్ అన్ని సందడిగా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ స్విమ్మింగ్ ఫూల్స్‎లో చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ఈత నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు నగరవాసులు. దీనితో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఈతగాళ్లతో కలకలాడుతున్నాయి. ఈత నేర్పించాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ పూల్‎కు తీసుకొస్తారు. సిమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం. ముఖ్యంగా వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‎పై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో సిటీలోని స్విమ్మింగ్ పూల్ అన్ని ఉదయం, సాయంత్రం వేళలో ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్స్‎లో ఈత నేర్చుకుంటున్నారు నగరవాసులు. సిమ్మింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పబ్లిక్. ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం, దొరుకుతుంది. బాడీ ఫిట్‎గా, మంచి ఆకృతిలో ఉంటుందని చెబుతున్నారు. దినచర్యలో భాగంగా డైలీ ఒకసారి స్విమ్మింగ్ చేయాలంటున్నారు ఈతగాళ్లు. స్విమ్మింగ్ చేయడం వల్ల కొన్ని జబ్బులకు, మెంటల్ టెన్షన్‎లకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు నిర్వాహకులు. స్విమ్మింగ్ పూల్స్‎లో ఈత నేర్చుకోవడం ఎంతో హ్యాపీగా ఉందంటున్నారు చిన్నారులు.

సిటీలో ఎండలు ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ పూల్స్‎కు క్యూ కడుతున్నారు నగరవాసులు. మరికొన్ని రోజులు అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి వేసవి సెలవులు రావడంతో పిల్లలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. గంటకు రూ.200 రూపాయాలు ఫీజు ఉంటుందని.. మంత్లీ కార్డు తీసుకుంటే రూ.3500 నుండి రూ.4000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు ఆర్గనైజర్స్. ప్రస్తుతం అయితే డైలీ స్విమ్మింగ్‎కు 100 మంది వరకు వస్తున్నారన్నారు. డైలీ 10% స్విమ్మింగ్ పూల్ వాటర్‎ను చేంజ్ చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లలకు ఈత నేర్పడానికి స్విమ్మింగ్ పూల్‎లో ప్రత్యేకంగా కోచ్‎లు ఉంటారని చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంచుతున్నామంటున్నారు. కొందరు ఈతను నేర్చుకుందామని స్విమ్మింగ్ పూల్‎కు వెళ్తే మరి కొందరు వేసవి నుండి ఉపశమనం పొందడానికి చిన్న, పెద్ద తేడా లేకుండా స్మిమ్మింగ్ ఫుల్ వైపు చూస్తున్నారు. దీంతో హైదరాబాద్ సిటీ స్విమ్మింగ్ పూల్స్‎కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles