Hyderabad: గ్రేటర్ వాసులకు అలర్ట్.. మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్.. ఎందుకో తెలుసా

| Edited By: Ravi Kiran

Nov 09, 2024 | 9:04 PM

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో పైపులకు భారీ లీకులు పడ్డాయి. క‌ల‌బ్ గూర్ నుంచి ప‌టాన్ చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీల ఏర్పడటంతో..

Hyderabad: గ్రేటర్ వాసులకు అలర్ట్.. మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్.. ఎందుకో తెలుసా
Hyderabad Water Service
Follow us on

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో పైపులకు భారీ లీకులు పడ్డాయి. క‌ల‌బ్ గూర్ నుంచి ప‌టాన్ చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీల ఏర్పడటంతో పెద్ద ఎత్తున వాటర్ వృధాగా పోతోంది. దీంతో ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ నెల 11 అంటే సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. దీంతో 24 గంట‌ల పాటు ఈ పైపుల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్, మరికొన్ని ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎం డివిజ‌న్ 15 – ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్.

ఇవి కూడా చదవండి

2. ఓ అండ్ ఎం డివిజ‌న్ 24 – బీరంగూడ‌, అమీన్ పూర్.

3. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2 – ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు.

4. ఓ అండ్ ఎం డివిజ‌న్ 6 – ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్.

5. ఓ అండ్ ఎం డివిజ‌న్ 9 – కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, మూసాపేట్, జ‌గ‌ద్గిరిగుట్ట‌.

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆదివారమే తగిన మంచినీటిని స్టోర్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పొదుపుగా నీటిని వినియోగించుకొని మరమ్మత్తు పనులకు సహకరించాలని కోరారు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..