One Drive: జూబ్లీహిల్స్ ‘వన్ డ్రైవ్’ బాత్రూంలో సీక్రెట్ (స్పై) కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు..

|

Sep 23, 2021 | 9:27 AM

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ 'వన్ డ్రైవ్' రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

One Drive:  జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ బాత్రూంలో సీక్రెట్ (స్పై) కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు..
One Drive
Follow us on

Hyderabad Jubilee Hills One Drive: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ‘వన్ డ్రైవ్’ రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న బెనర్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెనర్జీ రెస్టారెంట్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నాడు. అతనే స్పై క్యామ్ పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న స్పై క్యామ్ లో ఐదు గంటల డేటా ఉంది. స్పై క్యామ్‌ విషయంలో హౌస్‌కీపర్‌ని అరెస్ట్ చేసినా.. రెస్టారెంట్‌లో అసలు సీసీ కెమెరా బ్యాకప్‌ అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపైన కూడా చాలా డౌట్స్ ఉన్నాయి.. అందుకే హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలోనూ తనిఖీలు చేశారు పోలీసులు.

ఇక ఈ సీక్రెట్ కెమెరా వ్యవహారం లోతుల్లోకి వెళ్తే.. సాధారణంగా ‘ఒళ్లంతా కళ్లు చేసుకుని’ అంటుంటాం. ఇప్పుడా మాట నిజమై పోయింది. ఎక్కడ చూసినా మనల్ని ఏదో ఒక కెమెరా కన్ను వెంటాడుతూనే ఉంది. ఎక్కడ ఏ హిడెన్ కెమెరా దాగి ఉందో చెప్పడం కష్టం. ఓపెన్ ఏరియాస్ లోనే ఇలా ఉందంటే.. ఇక బాత్రూం, బెడ్రూమ్ లాంటి ప్రైవేట్ ఏరియాస్ సంగతి చెప్పనక్కర్లేదు. మీ స్మార్ట్ టీవీలో ఏ కెమెరా సెట్ చేశారో.. ఎవరు చూడొచ్చారు.

ఇక బయటకెళ్లారనుకోండి. ఏదైనా హోటల్ దిగారనుకోండి. ఈ కెమెరా కళ్లు ఎప్పుడు ఎక్కడ ఎన్నేసి ఉంటాయో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా బెడ్రూం, బాత్రూం వంటి ఏరియాస్ లో మనం ఒంటరి అన్న మాటకు తావు లేదు. గదిలో ఒక్కరిమే ఉన్నామనుకోడానికి వీల్లేదు. ఏ చాటు నుంచి ఏ కెమెరా కన్ను చూస్తుందో చెప్పడం కష్టం. మీరు అక్కడున్న వాచ్ లో టైం మాత్రమే తిరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఛార్జర్ కేవలం ఛార్జింగ్ కి మాత్రమే ఉపయోగ పడదు. బల్ప్.. జస్ట్ లైటింగ్ ఇస్తుందనుకుంటే పొరబాటే. పెన్ను, సర్వర్ బాయ్ చొక్కాకున్న బటన్ కావేవీ స్పై కెమెరాలకు అనర్హం.

రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని వన్ డ్రైవ్ ఇన్. బాత్రూంలో సీక్రెట్ మొబైల్ కెమెరా ఉదంతం వెలుగు చూసింది. అది ట్యూజ్ డే. మిడ్ నైట్.. ట్వల్వోక్లాక్. ఒక అమ్మాయి బాత్రూం వెళ్లింది. అసలే ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి. మరింత ఇంటలిజెంట్ కావడంతో.. ఒక్కసారి చుట్టుపక్కల పరిసరాలను చూసింది. ఆమె అనుమానం నిజమైంది. అక్కడ సీలింగ్ కి లైట్ ఫిక్స్ చేసే హోల్ లో ఒక మొబైల్ కెమెరా రికార్డ్ అవుతున్నట్టు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.

హుటాహుటిన వన్ డ్రైవ్ కు వచ్చిన పోలీసులు- నిర్వాహకుడు చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పని చేసే సర్వింగ్ బాయ్.. సీక్రెట్ గా ఈ పని చేసినట్టు గుర్తించారు. మొత్తం ఐదుగంటల ఫుటేజ్ రికార్డయినట్టు గమనించారు పోలీసులు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్ కి తరలించారు. ఒక మైనర్ బాలుడికే ఇలాంటి ఐడియాస్ వస్తుంటే.. ఇక ఇతరుల సంగతేంటి? అతడికీ ఆలోచన ఎలా వచ్చింది? ఈ ఫుటేజీ ఎక్కడికెళ్తుంది? ఇప్పటికే రాజ్ కుంద్రా లాంటి వ్యవహారాలు. పోర్న్ వీడియోలకు కోట్లలో పలుకుతున్న ధరలు. మరి ఈ వీడియోస్ కూడా పోర్న్ మార్కెట్ కే వెళ్తాయా? లేక ఆ బాలుడు తెలిసీ తెలియక ఈ విజువల్స్ పిక్చరైజ్ చేశాడా?

ఆ ఇటలీ రిటర్న్ యువతిలో ఒకటే టెన్షన్. చదువుకోడానికి తనతో పాటు ఇటలీకి రానున్న ముగ్గురు ఫ్రెండ్స్ తో కలసి ఆమె అక్కడికి వచ్చింది. సరదాగా టిఫిన్ చేయడానికి వస్తే.. ఆమెకీ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. ఇలా జరగుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఫుటేజీ మొత్తం కోర్టుకు సబ్మిట్ చేస్తామని అంటున్నారు. ఇంతకీ ఈ కేసులో నిర్వాహకుల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పరిశోధన చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ మొబైల్ సెట్ చేసింది.. సర్వర్ బాయ్ అయితే.. మరి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదై ఉండాలి. కానీ ఈ ఫుటేజీ కూడా.. డ్రైవ్ ఇన్ దగ్గర లేదంటున్నారు. దీంతో నిర్వాహకుల పాత్రపై దృష్టి సారించారు పోలీసులు. మరి చూడాలి.. ఇది ఆ మైనర్ పనా? లేక మేజర్లు ఎవరైనా దీని వెనక దాగున్నారా? తెలియాల్సి ఉంది.

One Drive 2

Read also:  Cyber Crime: యాప్ డౌన్లోడ్ చేయించి డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేశారు.. ఎంతకి.. ఎలా ముంచేశారంటే..!