ఆత్మరక్షణ కోసమా.. విలాసాల కోసమా..? హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్‌ కల్చర్‌..!

హైదరాబాద్‌లో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ మిస్‌యూజ్‌ కొత్త వివాదానికి దారితీస్తోంది. సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ కోసం తీసుకున్న గన్స్‌ను కొందరు జింకల వేటకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు స్టేటస్‌ సింబల్‌గా ప్రదర్శిస్తున్నారు. అసలు గన్‌ లైసెన్సులు తీసుకుంటున్నది ఆత్మరక్షణ కోసమా? విలాసాల కోసమా? ఆయుధాల వినియోగంపై పోలీసుల నిఘా ఎంతవరకు ఉంది?

ఆత్మరక్షణ కోసమా.. విలాసాల కోసమా..? హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్‌ కల్చర్‌..!
Hyderabad Gun Culture

Edited By:

Updated on: Oct 21, 2026 | 9:14 AM

ఆత్మరక్షణ కోసం గన్‌ లైసెన్స్‌ తీసుకుంటున్నారు.. కానీ ఆ తుపాకులతో అడవుల్లో వేట సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో కొందరి గన్‌ కల్చర్‌ ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీసింది. లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ దుర్వినియోగ ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. మలక్‌పేటలో జింక మాంసం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రైఫిల్‌తో పాటు ఎనిమిది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో జింకలను వేటాడి.. మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ కోసం తీసుకున్న ఆయుధాన్ని వేటకు ఉపయోగించినట్లు విచారణలో తేలింది. దీంతో గన్‌ లైసెన్స్‌ ముసుగులో సాగుతున్న హంటింగ్‌ కల్చర్‌ మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజుల కిందట మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కొందరు బడాబాబుల పిల్లలు లైసెన్స్‌డ్‌ వెపన్స్‌తో జింకల వేటకు వెళ్లి పోలీసులకు చిక్కారు. స్పోర్ట్స్ కోటా, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న అధునాతన ఆయుధాలను తీసుకుని షాద్‌నగర్ ప్రాంతంలోని అడవుల్లోకి జింకల వేటకు వెళ్లారు. పక్కా సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అడ్డంగా దొరికిపోయారు.

హంటింగ్‌తో పాటు ఫంక్షన్లలోనూ గన్‌ షో

హంటింగ్‌ మాత్రమే కాదు.. ఫంక్షన్లలోనూ గన్‌ షో నడుస్తోంది. పాతబస్తీలో స్టేటస్‌ సింబల్‌ తుపాకులను ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల చాంద్రాయణగుట్టలో ఓ వ్యక్తి పెళ్లి బరాత్‌లో లైసెన్స్‌డ్‌ వెపన్‌తో గాల్లో కాల్పులు జరపడం కలకలం రేపింది. సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ కోసం తీసుకున్న గన్‌తో బహిరంగంగా కాల్పులు జరపడంపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు హుస్సేనియాలంలో మాజీ ఆర్మీ అధికారి తన వద్ద ఉన్న లీగల్‌ వెపన్‌తో ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని మిగిల్చింది. ఇలా ఒకచోట వేటకు.. మరోచోట హోదా ప్రదర్శనకు.. ఇంకోచోట ప్రాణాలు తీసుకునేందుకు ఆయుధాలు ఉపయోగపడుతుండటం ఆందోళన రేపుతోంది.

వరుస ఘటనలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ దుర్వినియోగంపై చర్చ

వరుస ఘటనలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ మిస్‌యూజ్‌పై చర్చ మొదలైంది. అసలు గన్‌ లైసెన్సులు తీసుకుంటున్నది ప్రాణరక్షణ కోసమా? లేక విలాసాల కోసమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీకెండ్‌ హంటింగ్‌ పేరుతో ఫాంహౌస్‌లు, అటవీ ప్రాంతాలకు వెళ్లి జింకలు, నెమళ్లు, కుందేళ్లను వేటాడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గన్‌ లైసెన్సుల జారీ కంటే.. వాటి వినియోగంపై నిఘా ఎంత ఉందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ పేరుతో తీసుకున్న వెపన్స్‌.. వైల్డ్‌ హంటింగ్‌కు, స్టేటస్‌ సింబల్‌కు మారకుండా అడ్డుకోవడమే ఇప్పుడు పోలీసుల ముందున్న అసలు సవాల్‌..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us