హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. అర్థరాత్రి 12.30 వరకు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో ముఖ్యంగా జుబ్లీహీల్స్, బంజారా హిల్స్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, బేగంపేట ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. జిల్లాలోని పెద్దవూర, హాలియ, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, దామరచర్ల, కనగల్‌లో మండలాల్లో భారీ వర్షం కురువగా తిప్పర్తి, మాడ్గులపల్లి, కట్టంగూరు, తిరుమలగిరి, కొండమల్లేపల్లి, మునుగోడు, శాలిగౌరారం, డిండి, చండూర్, నార్కెట్‌పల్లి, కనగల్, అడవిదేవులపల్లి, దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి ప్రాంతాల్లో ఓ మోస్తారు జల్లులు కురిశాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.