GHMC : శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు బల్దియా ప్రాధాన్యత.. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స, పూర్తి వేతనం

|

May 23, 2021 | 7:52 PM

Ensuring Safety of Sanitation Workers : భాగ్యనగరంలో కొవిడ్ నియంత్రణకై అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకై..

GHMC : శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు బల్దియా ప్రాధాన్యత.. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స, పూర్తి వేతనం
Sanitation Staff
Follow us on

Ensuring Safety of Sanitation Workers : భాగ్యనగరంలో కొవిడ్ నియంత్రణకై అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకై జీహెచ్ఎంసీ ప్రాధాన్యతనిస్తోంది. స్వీపింగ్ విధులు నిర్వర్తించే కార్మికులు, ఎంటమాలజి వర్కర్లలో ఎవరైనా కొవిడ్ పాజిటివ్ బారిన పడిన వారికి ఐసోలేషన్ కు అనుమతిస్తూ తగు మందులను కూడా ఉచితంగా అందించడం తోపాటు పూర్తి వేతనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం తొలి విడత కరోనా నుండే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ గానీ ఇతర పరీక్షల్లో పాజిటివ్ వచ్చి, ఆ పాజిటివ్ మెసేజ్ మొబైల్ లో వచ్చిన కార్మికులందరికీ పూర్తి స్థాయి వేతనాలను కూడా అందచేస్తోంది. మొదటి నుండి, జీహెచ్ఎంసిలో ప్రతి రోజూ 1500 నుండి 2000 వేల మంది కార్మికులు వీక్లీ హాఫ్, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యంతో గైరుహాజరు అవుతూనే ఉంటారు. అయితే, ఈ గైర్హాజరు ఐన వారిలో తమకు పాజిటివ్ వచ్చిందని తమ సెల్ ఫోన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని సంబంధిత సర్కిల్ లోని అధికారులకు చూపిస్తే వారికి ఆయా ఐసోలేషన్ రోజుల వేతనాలను కూడా ఇవ్వడం జరుగుతోంది.

ప్రతీ నెలా 23 వ తేదీన సేకరించే పారిశుధ్య కార్మికుల హాజరు ప్రకారం వేతనాలను అందిస్తున్నారు. అయితే, పాజిటివ్ ఉన్న వారు మాత్రం తప్పనిసరిగా తమ సెల్ ఫోన్ కు వచ్చిన సమాచారం గానీ అధికారిక పోర్టల్ లో ఉంచిన వివరాలను మాత్రం సమర్పించాలని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Read also : Weather forecast : రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు.. ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.!