
హైదరాబాద్, అక్టోబర్ 17: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు భారీగా సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు సొంత వాహనాల్లోనూ పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగింది.
దసరా సెలవులు ప్రారంభం కావడంతో నగరవాసులు తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మియాపూర్ నుంచి బాలానగర్ వై జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ కోసం ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరం నుంచి బయలుదేరడంతో రహదారులపై రద్దీ నెలకొంది.
మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు సొంత వాహనాల్లోనూ ప్రజలు స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో నగరంలో పండుగ సందడి కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకునే పనిలో నిమగ్నమయ్యారు.