Revanth Reddy: పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

| Edited By: Velpula Bharath Rao

Oct 21, 2024 | 11:44 AM

అమరులైన పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Revanth Reddy: పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Follow us on

గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరులైన పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారు అంటే అందుకూ పోలీసులే కారణమన్నారు. రాష్ట్రం అభివృద్ధివైపు నడవాలంటే పోలీసులు చాలా కీలకమన్నారు. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు
అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

పోలీసులు అన్ని రకాల నేరగాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఎక్కువగా చదువుకున్నవారు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారని, సైబర్ క్రైమ్, డ్రగ్స్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో విపత్కర పరిస్థితిని ఎదురుకుంటుందని, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో డ్రగ్స్ విరివిగా రవాణా పెరిగిపోయిందని చెప్పారు.డ్రగ్స్ అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామన్నారు.

వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇక నుండి కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్‌లకు కోటి 25 లక్షలు,Dsp అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు నష్టపరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. .50 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి