యువతలో పెరుగుతున్న క్యాన్సర్.. ఆ సర్వేలో సంచలన అంశాలు..

దేశంలోని యువతలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాయని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ సర్వే వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స గురించి తెలుసుకోవడానికి తమ హెల్ప్ లైన్ నెంబర్ 935520202 కు విపరీతమైన కాల్స్ వస్తున్నట్లు తెలిపింది. మార్చి ఒకటి నుంచి మే 15 వరకు 1368 కాల్స్ వచ్చాయని తెలిపింది. వారిలో 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు 20 శాతం ఉన్నారని సర్వే తెలిపింది.

యువతలో పెరుగుతున్న క్యాన్సర్.. ఆ సర్వేలో సంచలన అంశాలు..
Cancer
Follow us

| Edited By: Srikar T

Updated on: May 27, 2024 | 2:27 PM

దేశంలోని యువతలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాయని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ సర్వే వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స గురించి తెలుసుకోవడానికి తమ హెల్ప్ లైన్ నెంబర్ 935520202 కు విపరీతమైన కాల్స్ వస్తున్నట్లు తెలిపింది. మార్చి ఒకటి నుంచి మే 15 వరకు 1368 కాల్స్ వచ్చాయని తెలిపింది. వారిలో 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు 20 శాతం ఉన్నారని సర్వే తెలిపింది. 40 సంవత్సరాల లోపు వారిలో 60 శాతం మంది పురుషులు ఉండగా.. క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్కు ఫోన్ చేసిన వారిలో 26% మంది తల, మెడ క్యాన్సర్‎కు సంబంధించిన వారు, 16% మంది గ్యాస్ట్రో ఇండస్ట్రినల్ క్యాన్సర్‎తో బాధపడుతూ ఉన్నారు. మరో 15% మంది బ్రెస్ట్ క్యాన్సర్, 9 శాతం మంది బ్లడ్ క్యాన్సర్‎తో బాధపడుతున్నారని సర్వే వెల్లడించింది. అయితే హైదరాబాదు నుంచి అత్యధిక కాల్స్ హెల్ప్ లైన్ సెంటర్‎కి వెళ్లినట్లుగా చెప్తున్నారు సర్వే అధికారులు. తర్వాత మీరు మీరట్, ముంబై, ఢిల్లీ తర్వాత స్థానాలలో ఉన్నాయి. క్యాన్సర్‎పై ఉచిత సలహాలు సూచనలు ఇవ్వడానికి కొంతమంది ఆంకాలజిస్టులో హెల్ప్ లైన్ నెంబర్‎ను ప్రవేశపెట్టారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ నెంబరు పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ బాధితుల్లో ఆ నెంబర్కు ఫోన్ చేసి ప్రముఖ ఆంకాలజిస్ట్లతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు బాధితులు. క్యాన్సర్ చికిత్స‎కు సంబంధించినటువంటి సందేహాలు అంతేకాకుండా వీడియో కాల్ రూపంలో కూడా తమ సందేహాలను అడిగి తెలుసుకుంటున్నారు క్యాన్సర్ బాధితులు.

హెల్ప్ లైన్ నెంబర్తో దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అదొక సపోర్ట్ సిస్టంగా ఉపయోగపడుతుందని క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ హెడ్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు . హెల్ప్ లైన్‎కు రోజుకు వందల కాల్స్ వస్తున్నాయని అనే తెలియజేశారు. ఫోన్ చేస్తున్న వారిలో ఎక్కువమంది తల, మెడ క్యాన్సర్ బాధితులు ఉన్నారని వెల్లడించారు. అయితే రోజువారి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం టీకాలు తీసుకోవడం వంటి చర్యలతో ఆ క్యాన్సర్‎ను నివారించవచ్చన్నారు. అలాగే ప్రభావంతమైన స్క్రీనింగ్ స్ట్రాటజీస్‎తో బ్రెస్ట్ కొల్లాన్ క్యాన్సర్‎ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు అన్నారు. అయితే సరైన స్క్రీనింగ్ తీసుకోకపోవడం వల్ల దేశంలోని మూడింట రెండు వంతుల క్యాన్సర్ కేసులను ఆలస్యంగా గుర్తించారని తెలిపారు. దేశంలో డయాగ్నోస్ క్యాన్సర్ కేసుల్లో 27% మొదటి రెండు దశలోనే ఉన్నాయి 63% కేసులు మూడు నాలుగు దాసుల్లో ఉన్నాయి తమ చికిత్స సరైనదా కాదా అప్ టు డేట్ ఉందా అని తెలుసుకోవడానికి చాలామంది బాధితులు రెండో అభిప్రాయం కోసం కాల్ చేస్తున్నారు.. ప్రతివారం కొత్త మందులను అప్రూవ్ చేస్తున్నా నేపథ్యంలో తమ చికిత్సకు ఆ మందులు దొరుకుతున్నాయా లేదా అని మరి కొంతమంది హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు తమ క్యాన్సర్ ఏ దశలో ఉందని చాలామంది బాధితులు అడిగారని అలాగే కుటుంబ సభ్యులకు క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఏం చేయాలో అడిగి తెలుసుకుంటున్నారని డాక్టర్ ఆశిష్ తెలిపారు.