నిందితులను ఉరి తీయాలిః బీజేపీ నేత లక్ష్మణ్‌

| Edited By: Srinu

Nov 30, 2019 | 5:43 PM

మృగాళ్ల చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను ఉరితీయాలని బీజేపీ నేత లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను లక్ష్మణ్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. వైద్యురాలి ఘటన దేశాన్ని కలవరపరిచిందని పేర్కొన్నారు. అమ్మాయిల కిడ్నాప్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలి కుటుంబసభ్యులను పోలీసులు హేళన చేస్తూ మాట్లాడటం విచారకరమన్నారు. సకాలంలో స్పందిస్తే ఇంత […]

నిందితులను ఉరి తీయాలిః బీజేపీ నేత లక్ష్మణ్‌
Follow us on

మృగాళ్ల చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను ఉరితీయాలని బీజేపీ నేత లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను లక్ష్మణ్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. వైద్యురాలి ఘటన దేశాన్ని కలవరపరిచిందని పేర్కొన్నారు. అమ్మాయిల కిడ్నాప్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలి కుటుంబసభ్యులను పోలీసులు హేళన చేస్తూ మాట్లాడటం విచారకరమన్నారు. సకాలంలో స్పందిస్తే ఇంత దారుణ ఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. మంత్రుల వ్యాఖ్యల తీరు చూస్తే అసహ్యాంగా ఉందని వ్యాఖ్యానించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడం బాధాకరమని తెలిపారు. పబ్‌, డ్రగ్ కల్చర్‌ హైదరాబాద్‌ను పట్టి పీడిస్తోందని చెప్పారు. న్యాయవాదులెవరూ నిందితుల తరపున వాదించవద్దని విజ్ఞప్తి చేశారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలను కట్టడి చేయలేకపోతున్నామని వాపోయారు.