
ఉబెర్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రైడింగ్ సేవలను అందిస్తోందదీ కంపెనీ. అమెరికాకు చెందిన ఈ కంపెనీ భారత్‌లోనూ సేవలను విస్తరించిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత ఈ కంపెనీ అతిపెద్ద టెక్ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో తన సేవలను మరింత విస్తరించేందుకు ఉబెర్ మొగ్గుచూపతోంది.
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉబర్ కంపెనీ హైదరాబాద్‌లో తమ సేవలను విస్తరించనుంది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఉబెర్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఉబర్ కంపెనీ అమెరికా తర్వాత అతి పెద్ద టెక్ సెంటర్‌ను హైదరాబాద్‌నే నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా తమ మొబిలిటీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టుతో సుమారు 1000 మంది ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని కంపెనీ చెబుతోంది. హైదరాబాద్‌లో రెండు వినూత్న సేవలను పరిచయం చేయాలని ఈ కంపెనీ నిర్ణయించింది. ఉబెర్ గ్రీన్ పేరుతో జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలపై ప్రీమియం, సమర్థమైన రైడ్‌లను అందించడానికి ఉబెర్ షటిలో సర్వీస్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ దిశగా ఇప్పటికే ఉబెర్ అడుగులు వేస్తోంది.
ఇక తెలంగాణలో పర్యావరణ సంరక్షణ బాధ్యతగా తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉబెర్ విస్తరణ, హైదరాబాద్‌లో కంపెనీ కొత్త సేవలతో రాష్ట్రంలో మొబిలిటీ, ఆటోమోటివ్ రంగం వృద్ధి చెందనుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..