కంటోన్మెంట్ ప్రాంతవాసులకు ఆర్మీ సడన్ షాక్… ఏంటంటే?

| Edited By:

Sep 26, 2019 | 12:07 PM

నగరంలోని కంటోన్మెంట్ వాసులకు ఆర్మీ సడన్ షాక్ ఇచ్చింది. ఏలాంటి ముందస్తు సూచన లేకుండా మిలటరీ ప్రాంతాల్లో రహదారులను మూసివేసింది. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు తెలిసిందే. దీంతో నగరంలోని ఆర్మీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్మీ ప్రాంతాలైన కంటోన్మెంట్, ఆల్వాల్, మారేడ్ పల్లి ప్రాంతాల్లోని రహదారులను మూసివేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి మల్కాజ్ గిరి నేరేడ్ మెట్ వెళ్లేందుకు వాహనదారులు ఎక్కువగా వెస్ట్ అండ్ ఈస్ట్ […]

కంటోన్మెంట్ ప్రాంతవాసులకు ఆర్మీ సడన్ షాక్... ఏంటంటే?
Follow us on

నగరంలోని కంటోన్మెంట్ వాసులకు ఆర్మీ సడన్ షాక్ ఇచ్చింది. ఏలాంటి ముందస్తు సూచన లేకుండా మిలటరీ ప్రాంతాల్లో రహదారులను మూసివేసింది. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు తెలిసిందే. దీంతో నగరంలోని ఆర్మీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్మీ ప్రాంతాలైన కంటోన్మెంట్, ఆల్వాల్, మారేడ్ పల్లి ప్రాంతాల్లోని రహదారులను మూసివేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి మల్కాజ్ గిరి నేరేడ్ మెట్ వెళ్లేందుకు వాహనదారులు ఎక్కువగా వెస్ట్ అండ్ ఈస్ట్ మారేడ్ పల్లి ప్రాంతంలో ఉన్న ఏఓసీ రహదారిని ఉపయోగిస్తుంటారు. అయితే గతంలో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నా.. అప్పట్లో కొద్ది రోజుల ముందు నుంచి అలర్ట్ చేసేవారు. అయితే బుధవారం రోజు అకస్మాత్తుగా ఆర్మీ అధికారులు రాత్రి వేళల్లో రహదారులను మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమయం రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 వరకు ఉంటుందని ఢిఫెన్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అటు బోల్లారం వైపు కూడా రహదారును రాత్రి వేళల్లో మూసివేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆల్వాల్, లొతుకుంట ప్రాంతంలోని రాష్ట్రపతి నిలయం రహదారి కూడా మూసివేశారు. అధికారికంగా రాత్రి వేళల్లో అని చెప్పినా.. రాష్ట్రపతి నిలయం వైపు మాత్రం ఉదయం 10.00 గంటల వరకు కూడా ఎవర్నీ వెల్లనివ్వడం లేదని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలంటూ చెబుతున్నారు. ఆర్మీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.