Weather: ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది? జిల్లాల వారీగా వర్ష సూచన ఇదిగో!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదివారం, సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, కడప, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది.

Weather: ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది? జిల్లాల వారీగా వర్ష సూచన ఇదిగో!
Rain Alert

Updated on: Oct 18, 2026 | 7:26 AM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం.. అలాగే.. దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు.. ఆదివారం, సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలైన.. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్..

ఆదివారం (18-10-2026).. అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us