ఫ్రెండ్‌తో డబుల్ బెడ్‌ రూమ్‌లో ఏకాతంగా యువతి.. ఈలోగా తండ్రి రావడంతో!

తెల్లాపూర్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. తన ఫ్రెండ్‌తో కలిసి ఫ్లాట్‌లో ఉన్న యువతి తండ్రి ఆకస్మికంగా రావడంతో భయపడి తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్రెండ్‌తో డబుల్ బెడ్‌ రూమ్‌లో ఏకాతంగా యువతి.. ఈలోగా తండ్రి రావడంతో!
Boy Girl Relationship

Edited By:

Updated on: Dec 20, 2025 | 9:58 PM

ఫ్రెండ్‌తో కలిసి ఫ్లాట్‌లో ఉన్న సమయంలో తండ్రి అక్కడికి రావడంతో భయపడిన ఓ యువతి, తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో ఫ్లోర్ నుంచి కిందపడి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత బస్తీకి చెందిన 20 ఏళ్ల యువతి నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది.

గురువారం యువతి తన స్నేహితుడితో కలిసి ఆ ఫ్లాట్‌కు వెళ్లి అక్కడ ఏకాంతంగా గడుపుతోంది. ఈ సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు యువతి తండ్రి ఫ్లాట్‌కు వచ్చాడు. బయట నుంచి ఫ్లాట్‌కు తాళం వేసి ఉన్నా.. లోపల నుంచి చప్పుళ్లు రావడంతో.. ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో తండ్రి బయట నుంచి కేకలు వేశాడు. తండ్రి వచ్చాడన్న భయంతో యువతి, ఆమె ఫ్రెండ్ పక్క ఫ్లాట్ వైపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఎనిమిదో అంతస్తులోని బాల్కనీ నుంచి యువతి కిందపడింది. తీవ్ర గాయాల పాలైన ఆమె స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి