వీకెండ్ వచ్చిందంటే చాలు… ఇదేం పనిరా సామి.. రికార్డ్ సృష్టిస్తున్న మందు బాబులు..!

వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో మందు బాబులు రెచ్చిపోతున్నారు. తాగడం ఒక ఎత్తు అయితే, తాగి వాహనాలు నడిపి యాక్సిడెంట్లకు కారకులు అవుతున్నారు. న్యూ ఇయర్ దగ్గర పడుతున్న తరుణంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

వీకెండ్ వచ్చిందంటే చాలు... ఇదేం పనిరా సామి.. రికార్డ్ సృష్టిస్తున్న మందు బాబులు..!
Drunk And Drive

Edited By:

Updated on: Dec 21, 2025 | 6:50 PM

వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో మందు బాబులు రెచ్చిపోతున్నారు. తాగడం ఒక ఎత్తు అయితే, తాగి వాహనాలు నడిపి యాక్సిడెంట్లకు కారకులు అవుతున్నారు. న్యూ ఇయర్ దగ్గర పడుతున్న తరుణంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్ సైబరాబాద్‌లో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఇకపై తాగి వాహనం నడిపితే ఊరుకునేదీ లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా తాగి వాహనం నడిపిన 409 మందిపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 290 ద్విచక్ర వాహనదారులు, 23 ఆటోలు, 95 కార్లు, ఒక హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే, 352 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య, 37 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య, 20 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారు.

వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్‌ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక, గత వారం రోజుల్లో మొత్తం 756 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో ఇద్దరికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధించింది కోర్టు. సోషల్‌ సర్వీస్ కింద 754 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..