దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు.. లేదంటే మీ ఇళ్లు గుల్లే!

దసరా, దీపావళి సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు పోలీసుల కీలక సూచనలు జారీ చేశారు. నగరంలో దొంగలు ఎక్కువైపోయారని.. ప్రజలు ఊళ్లకు వెళ్లేటప్పుడు బ్యాంక్ లాకర్లు, బలమైన తాళాలు, సెన్సార్ లైట్లు, సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరిచారు. కావాలంటే సేఫ్టీ కోసం లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకోవాలపి సూచించారు. అలాగే మీ ప్రయాణ వివరాలు సోషల్ మీడియాలో పంచుకోకపోవడం వంటివి చేయొద్దన్నారు. అప్రమత్తతే ఉత్తమ రక్షణ అని పోలీసులు ప్రజలకు సూచించారు.

దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు.. లేదంటే మీ ఇళ్లు గుల్లే!
Hyderabad Festive Thefts

Edited By:

Updated on: Oct 07, 2026 | 2:06 PM

దసరా, దీపావళి వరుస సెలవుల వేళ హైదరాబాద్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నాయి. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్తుండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగల ముఠాలు విరుచుకుపడుతున్నాయి. ఈ మధ్యే తాళం వేసిన ఇండ్లలో 30 లక్షల విలువైన బంగారం దోచుకెళ్లగా, మేడిపల్లి క్యారెట్ లైన్ షోరూమ్‌లో కేవలం 5 నిమిషాల్లోనే 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా నెక్నాంపూర్‌లో మారణాయుధాలతో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేయడం, శంషాబాద్‌ సాతంరాయిలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం లూటీ చేసి 7.4 లక్షలు కాజేయడం నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు నగరంలో రెక్కీ నిర్వహించి ఈ దారుణాలకు ఒడిగడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ పండగ సీజన్ లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తత వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో విలువైన ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. డోర్లకు నాసిరకం తాళాలు కాకుండా బలమైన సురక్షితమైన లాకింగ్ సిస్టమ్స్ ఉపయోగించాలని, దొంగలను భయపెట్టేలా ప్రాంగణంలో కదలికలను బట్టి వెలిగే సెన్సార్ లైట్లను అమర్చుకోవాలని సూచిస్తున్నారు. వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లను ఆపమని ముందే ఏజెంట్లకు చెప్పడం ద్వారా ఇల్లు ఖాళీగా ఉందనే విషయం దొంగలకు తెలియకుండా జాగ్రత్తపడవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా చోరీలను సమర్థవంతంగా అరికట్టవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌ పరిధిలో అందుబాటులో ఉన్న లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ లేదా పోలీస్ యాప్‌లలో ముందస్తుగా సమాచారం నమోదు చేసుకోవాలి. దీనివల్ల పోలీసులు మీ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. అలాగే ఇళ్లలో ఐపీ కెమెరాలు, వైఫై సిసిటీవీలు ఏర్పాటు చేసుకుంటే.. మన ప్రయాణంలో కూడా మొబైల్ ఫోన్ ద్వారా నిమిషానికోసారి ఇంటి వద్ద పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించే వీలుంటుంది.

ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు చుట్టుపక్కల ఉండే నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇచ్చి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ చేయమని కోరాలి. అలాగే సోషల్ మీడియాలో ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్తున్నాం అంటూ లైవ్ లొకేషన్లు, ఫోటోలు పోస్ట్ చేయడం దొంగలకు దారి చూపినట్లే అవుతుందని, తిరిగి వచ్చిన తర్వాతే వాటిని షేర్ చేయాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us