Mobile Phone Lost: మొబైల్ ఫోన్ పోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిన యువకుడు.. చివరికి ఏం చేశాడంటే..

Mobile Phone Lost: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని దుండిగల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ పోయిందని డిప్రెషన్‌కు లోనై..

Mobile Phone Lost: మొబైల్ ఫోన్ పోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిన యువకుడు.. చివరికి ఏం చేశాడంటే..
Suicide

Updated on: Apr 02, 2021 | 1:35 PM

Mobile Phone Lost: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని దుండిగల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ పోయిందని డిప్రెషన్‌కు లోనై.. చివరికి ప్రాణాలు వదులుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన బాధిత కుటుంబం జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం దుండిగల్‌కు వచ్చారు. ఓ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఇంటి పెద్ద చనిపోగా.. మహిళ, ఆమె కూతురు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మహిళ కొడుకు(17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఇటీవల ఆ యువకుడి స్మార్ట్ ఫోన్ పోయింది.

దాంతో తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఈ క్రమంలో బాధితుడి తల్లి, సోదరి పనికి వెళ్లాక.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన చట్టుపక్కన వాళ్లు.. యువకుడి తల్లికి, సోదరికి సమాచారం అందించారు. వెంటనే ఇంటికి వచ్చి చూడగా.. యువకుడు విగతజీవిగా పడి ఉన్నాడు. అది చూసి యువకుడి తల్లి, సోదరి బోరున విలపించారు. వారి రోదన చుట్టుపక్కన వారిని కన్నీరు పెట్టించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, తన తల్లి ఇచ్చిన ఫోన్‌ పోవడంతో డిప్రెషన్‌కు లోనై యువకుడు ఇంతటి కఠని నిర్ణయాన్ని తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also read:

Ustad Bade Ghulam Ali Khan: అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సమాధి ఎక్కడుందో తెలుసా..

Tamil Nadu Elections 2021: అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కూతుళ్లు..

Big Bazaar: ఆర్డర్‌ చేసిన రెండు గంటల్లోనే హోమ్‌ డెలివరి.. బిగ్‌బజార్‌ నిర్ణయం.. రూ.1000 దాటితే ఉచిత డెలివరీ