Hyderabad: తాజ్‌మహల్‌ హోటల్‌లో జెర్రి తాలీ.. పప్పులో కనిపించిన జెర్రి.. సగం తిన్నాక, వ్యాక్!

|

Sep 24, 2024 | 4:50 PM

అసలే ఆహార కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అయితే రెగ్యులర్‌గా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు. అయినా కూడా కొందరు హోటళ్ల వ్యాపారులు నిర్లక్ష్యం వీడట్లేదు.

Hyderabad: తాజ్‌మహల్‌ హోటల్‌లో జెర్రి తాలీ.. పప్పులో కనిపించిన జెర్రి.. సగం తిన్నాక, వ్యాక్!
Jerri In Food
Follow us on

అసలే ఆహార కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అయితే రెగ్యులర్‌గా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు. అయినా కూడా కొందరు హోటళ్ల వ్యాపారులు నిర్లక్ష్యం వీడట్లేదు. అందుకు ఉదాహరణే హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌.

ఏళ్లతరబడి గుడ్‌విల్ ఉందికదా అనుకున్నారో ఏమో..! నిర్లక్ష్యంగా ఫుడ్‌ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే ఆహారంలో ఏకంగా జెర్రి రావడం ఏంటి? వచ్చిందని కస్టమర్ చెబితే.. పట్టించుకోకపోవడం ఏంటి? మిగతా అందరికీ అదే పప్పు వడ్డించడం ఏంటి? అడిగితే మరో పప్పు తయారైపోయిందని సమాధానం చెప్పారు తాజ్‌ మహల్ హోటల్ నిర్వాహకులు. పప్పు గిన్నెలో జెర్రిని చూస్తుంటే వెగటు వస్తోంది. చూస్తున్న మనకే ఇలా ఉంటే.. సగం తిన్న కస్టమర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. R

కస్టమర్‌ సీరియస్ అవుతుంటే కూడా సదరు హోటల్ నిర్వాహకుల్లో ఏ మాత్రం మార్పు లేదు. మేం కూడా అదే తిన్నాం.. ఏమైనా అయితే మాకు కూడా అవుతుందీ అంటూ వెటకారం చేశారంట. ఇక ఆ కస్టమర్ ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో తెలీక జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. వాళ్లు.. ఫోటోలు పంపిండి చూస్తాం అంటూ చెప్పుకొచ్చేసరికి, విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు సదరు కస్టమర్‌. మరి ఇప్పుడు జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఏం చేస్తారో చూడాలి..!

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..