రూ.20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు.. అయినా ఆశ తీరలేదు.. అయ్యో కవిత..

హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో అదనపు కట్నం వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన కవితకు 2014లో శ్రీనివాస్‌తో వివాహమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భర్తతో పాటు ఐదుగురిపై BNS సెక్షన్‌ 108 కింద మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు.. అయినా ఆశ తీరలేదు.. అయ్యో కవిత..
Hyderabad Dowry Harassment Case

Edited By:

Updated on: Oct 02, 2026 | 12:18 PM

అదనపు కట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన పి.కవిత (28)కి హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీనివాస్‌తో 2014లో వివాహమైంది. పెళ్లి సమయంలో కవిత కుటుంబ సభ్యులు రూ.20 లక్షలు కట్నంగా ఇచ్చినట్లు సమాచారం. వివాహమైన తొలినాళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. కొంతకాలానికి అదనపు కట్నం కోసం అత్తింటివారి నుంచి వేధింపులు మొదలయ్యాయని కవిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ వేధింపులపై 2019లో గజ్వేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినప్పటికీ కవితకు వేధింపులు కొనసాగినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల వారం రోజులుగా కవిత, శ్రీనివాస్‌ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని మధురానగర్‌ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 29న కవిత పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

కవిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధురానగర్‌ పోలీసులు శ్రీనివాస్‌, అతడి తల్లి, ఇద్దరు సిస్టర్స్, బావపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు BNS సెక్షన్‌ 108 కింద కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కట్న వేధింపుల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us