Hyderabad: మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

హైరదాబాద్‌ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏకంగా పోలీసు అధికారుల ఇళ్లలోకి చొరబడి మరీ కొందరు దుండగులు దొంగతనాలు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ IAS, IPS క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌ రే భార్య దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!
Hyderabad Murder

Updated on: May 08, 2026 | 1:35 PM

హైదరాబాద్‌ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీహిల్స్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐఏఎస్ ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద శుక్రవారం తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్లూస్ టీమ్ సహాయంలో ఘటనా స్థలంలోని వేలిముద్రల సేకరిస్తు్న్నారు. అయితే ఇంట్లో పని మనుషులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పన అనే నేపాల్‌కు చెందిన మహిళ గత 8 నెలలుగా ఇంట్లో పని చేస్తుందని.. ఆమె పథకం ప్రకారం మరికొందరితో కలిసి సునందను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

సునంధ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి కల్పన తమ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చిందని.. దీంతో అక్కడికి చేరుకున్న నలుగురి వ్యక్తులతో కలిసి సునందను హత్య చేశారని.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకొని అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దారుణంలో నేపాలీ గ్యాంగ్ ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us