Watch: అరెరె.. ఇతనెవరో గుర్తు పట్టారా..? సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్ పార్కు చుట్టూ చక్కర్లు..!

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సివిల్ డ్రెస్‌లో బైక్‌పై కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వన్‌వే అమలు, రోడ్ నంబర్ 45 నుండి ఫిల్మ్‌నగర్ వరకు ట్రాఫిక్ సరళిని గమనించారు. ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Watch: అరెరె.. ఇతనెవరో గుర్తు పట్టారా..? సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్ పార్కు చుట్టూ చక్కర్లు..!
Hyderabad Cp Sajjanar Bike Patrol

Updated on: Aug 20, 2026 | 4:52 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సివిల్ డ్రెస్‌లో బైక్‌పై పర్యటించారు. కేబీఆర్ పార్కు చుట్టూ రెండుసార్లు బైక్‌పై తిరుగుతూ వన్‌వే ట్రాఫిక్ అమలును పరిశీలించారు. రోడ్ నంబర్ 45 నుంచి ఫిల్మ్‌నగర్ వరకు ట్రాఫిక్ సరళిని గమనించారు. వివిధ జంక్షన్‌లలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం కూడా మరోసారి అదే మార్గంలో పర్యటించి ట్రాఫిక్ రాకపోకలను పరిశీలించారు.

వన్‌వే అమలు తొలి రోజున వాహనదారుల్లో కొంత అయోమయం కనిపించినప్పటికీ, రెండో రోజుకే ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అన్ని జంక్షన్‌ల వద్ద స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. GHMC, నిర్మాణ సంస్థతో సమన్వయంతో H-CITY పనులు కొనసాగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకరించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us