స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ఇస్రోల మధ్య కీలక ఒప్పందం.. తేలికపాటి ఉపగ్రహాల అభివృద్ధికి సహకారం

|

Feb 04, 2021 | 9:34 PM

అంతరిక్ష వాహక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇస్రోకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, అనుభవం, సదుపాయాలను వినియోగించుకునే అవకాశం స్కైరూట్‌కు లభిస్తుంది.

స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ఇస్రోల మధ్య కీలక ఒప్పందం.. తేలికపాటి ఉపగ్రహాల అభివృద్ధికి సహకారం
Follow us on

ISRO MOU with skyroot airspaces :హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనల సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌, భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) తో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో అంతరిక్ష వాహక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇస్రోకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, అనుభవం, సదుపాయాలను వినియోగించుకునే అవకాశం స్కైరూట్‌కు లభిస్తుంది. ‘ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. మేం తయారు చేసిన ఉపకరణాలను త్వరలో ఇస్రో కేంద్రాల్లో పరీక్షిస్తామని స్కైరూట్‌ ‘ట్వీట్‌’ చేసింది.

గతంలో ఇస్రోలో పనిచేసిన నాగ భరత్‌, పవన్‌ కుమార్‌ చందన కలిసి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ ప్రధానంగా ‘లాంచ్‌ వెహికల్‌ టెక్నాలజీ’ మీద పనిచేస్తోంది. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టటానికి వీలైన మూడు రకాల లాంచ్‌ వెహికల్స్‌ను ఇప్పటికే ఈ సంస్థ ఆవిష్కరించింది. దీనికి ఇప్పటికే 4.3 మిలియన్‌ డాలర్ల వెంచర్‌ కేపిటల్‌ నిధులు లభించాయి. మరో 15 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించే యత్నాల్లో ఈ సంస్థ ఉన్నట్లు సమాచారం. కాగా ఇస్రోతో చేసుకున్న ఒప్పందం కారణంగా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధిస్తామని స్కైరూట్ సంస్థ భావిస్తోంది. ఇస్రోకు సంబంధించిన తేలికపాటి ఉపగ్రహాలను అందించేందుకు కృషీ చేస్తామని సంస్థ పేర్కొంది.


Read Also…  Second Dose Vaccine: ఫిబ్రవరి 13 నుంచి కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు: కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి