Fire Accident: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు.. రూ. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం..

Fire Accident: సిద్దిపేట జిల్లా గజ్వెల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కేంద్రంలో ఒక్కసారిగా..

Fire Accident: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు.. రూ. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం..

Updated on: Sep 19, 2021 | 10:53 PM

Fire Accident: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కేంద్రంలో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 50 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Also Read: Shocking News: వాషింగ్ మెషిన్ నుండి పెద్ద పెద్ద శబ్ధాలు.. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే గుండె గుభేల్ అంది..!

Viral News: డైపర్‌లపై క్రేజ్.. నెలల తరబడి టాయిలెట్‌‌కు వెళ్లకుండా ఉన్నాడు.. ఆఖరికి పెళ్లిలోనూ..

Monkey Video: అయ్యో పాపం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కున్న కోతి పిల్ల.. ఆ తరువాత ఏం జరిగిందంటే..