ఈ ఫోటోలోని క్యూట్‌ అబ్బాయిని గుర్తుపట్టారా? తెలుగు రాష్ట్రాల్లో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ పొలిటికల్‌ లీడర్

ఫై ఫొటోలో హ్యాండ్సమ్‌గా, అదిరిపోయే హెయిర్‌ స్టైల్‌తో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు తెలుగు నాట బాగా ఫేమస్‌. తనదైన వాక్చాతుర్యంతో పొలిటికల్‌ సర్కిల్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ..

ఈ ఫోటోలోని క్యూట్‌ అబ్బాయిని గుర్తుపట్టారా? తెలుగు రాష్ట్రాల్లో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ పొలిటికల్‌ లీడర్
Childhood Photo

Updated on: Apr 17, 2023 | 6:54 AM

ఫై ఫొటోలో హ్యాండ్సమ్‌గా, అదిరిపోయే హెయిర్‌ స్టైల్‌తో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు తెలుగు నాట బాగా ఫేమస్‌. తనదైన వాక్చాతుర్యంతో పొలిటికల్‌ సర్కిల్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాన్య వ్యక్తిగా వివిధ సందర్భాల్లో పలు వేదికల మీద ఆయన చేసే ప్రసంగాలు యువతను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక ప్రత్యర్థులకు పంచులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ పొలిటికల్‌ లీడర్‌ చాలా యాక్టివ్‌. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేయడం మొదలు తన ప్రొఫెషనల్‌, పర్సనల్‌ లైఫ్‌ వరకు అన్ని విషయాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఫొటో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఫంకీ హెయిర్‌ స్టైల్‌తో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా మరి? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌. మేమే చెప్తాం లెండి. ఆయన మరెవరో కాదు.. తెలంగాణకు చెందిన ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌).

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ తాజాగా తన చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేశారు. దీనికి ‘ అప్పట్లో మంచి హెయిర్‌ స్టైల్‌ ఉండేది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది. కేటీఆర్‌ అభిమానులు, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇక బీఆర్‌ఎస్‌ శ్రేణులైతే కేటీఆర్‌ మరిన్ని త్రో బ్యాక్‌ ఫొటోలు షేర్‌ చేసుకుంటూ నెట్టింట తెగ సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..