Gemini virus: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కన్నీళ్లు.. ధర బాగా ఉన్న సమయంలో జెమిని వైరస్ అటాక్

భయంకరమైన జెమిని వైరస్ (బొబ్బర తెగులు) ఖమ్మం జిల్లాలోని మధిర, ఏణకూరు, కొణిజెర్ల, కామేపల్లి, తిరుమలయపాలం మండలాల్లో మిరప రైతుల ఆశలను దెబ్బతీసింది.

Gemini virus: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కన్నీళ్లు.. ధర బాగా ఉన్న సమయంలో జెమిని వైరస్ అటాక్

Updated on: Feb 15, 2021 | 9:49 AM

Gemini virus:  భయంకరమైన జెమిని వైరస్ (బొబ్బర తెగులు) ఖమ్మం జిల్లాలోని మధిర, ఏణకూరు, కొణిజెర్ల, కామేపల్లి, తిరుమలయపాలం మండలాల్లో మిరప రైతుల ఆశలను దెబ్బతీసింది. వైరస్ ప్రభావంతో ఎకరానికి దాదాపు మూడు నుండి ఐదు క్వింటాళ్ల ఉత్పత్తిని కోల్పోయి ప్రభావం ఉందని.. దీని ద్వారా వచ్చే కొద్దో, గొప్పో వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరపకాయ పెంపకానికి ఒక రైతు ఎకరానికి రూ .1.10 లక్షల నుంచి రూ .1.25 లక్షలు పెట్టుబడి పెడతాడు. ప్రస్తుతం ఉన్న రేటును బట్టి చూస్తే.. ఎకరానికి పది క్వింటాళ్లకు పైగా ఉత్పత్తి చేయగలిగితేనే వారు కొంత ఆదాయాన్ని అర్జిస్తారు. 

వైట్ఫ్లై ద్వారా జెమిని వైరస్ సంక్రమిస్తుంది. దీని ప్రభావంతో ఆకు-కర్లింగ్, ఆకు-రోలింగ్, ముడత, బూడిద తెగులు వంటిని పంటకు వ్యాపిస్తాయి. దీంతో పంట దిగుబడి బాగా పడిపోతుంది. కోణిజర్లకు చెందిన చెందిన కౌలుదారు రైతు కె బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ ఎకరానికి రూ .25 వేల కౌలు చెల్లించి మరీ మిరప పంట వేశానని చెప్పారు.  అయితే, జెమిని వైరస్ కారణంగా, దిగుబడి భారీగా తగ్గిపోయిందని వెల్లడించారు. తాను ఇప్పటివరకు రూ .2.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, పెట్టుబడి డబ్బు కూడా వెనక్కి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఖమ్మం జిల్లాలో 56,000 ఎకరాలలో మిరప పంటను ఈ ఏడాది సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 2 వేల ఎకరాలు ఎక్కువ. పోయిల్ సంవత్సరం క్వింటాల్‌కు రూ .20 వేలు వరకు ధర పలకడంతో రైతులు మిరప సాగు వైపు మొగ్గు చూపారు. విత్తనాల రకం ఆధారంగా ప్రస్తుతం దీని ధర క్వింటాల్‌కు రూ .9,000 నుంచి రూ .14 వేల మధ్య పలుకుతుంది. పొలంలో దున్నుతున్నప్పుడు రైతులు ట్రెక్‌డెర్మా వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జి అనసూయ సూచించారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాల తరువాత పంట మార్పిడి చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. 

Also Read:

ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..

Loading...
Unable to load recommendations.
Follow Us