
వంటచేస్తున్న క్రమంలో ఇంట్లోని సిలిండర్ పేలిన ఘటన మోదక్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే కౌడిపల్లి మండలం మూట్రాజ్ పల్లికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే ఆయన తల్లి మరణించడంతో.. ఆదివారం ఆయన తన తల్లికి నెల మాసికం కార్యక్రమం ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు శబ్ధం విన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందోననే భయంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రమాదం నుంచి తేరుకొని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బాధితుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇక ఈ ప్రమాదంపై శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేడులు దాటికి ఇంట్లోని ఫర్నీచర్‌తో పాటు గోడలు ధ్వంసమైనట్టు తెలిపాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.60లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు ఆయన పేర్కొన్నాడు. ప్రమాద సమయంలో చిన్నారులతో కలిపి ఇంట్లో 20 మంది ఉన్నామంటూ తెలియజేశారు.
వీడియో చూడండి..