
పాలు కావాలంటే.. పక్కనున్న షాప్‌కు వెళ్లామా.. ఓ ప్యాకెట్ కొని తెచ్చినామా అని అనుకుంటారు కొందరు. కానీ ఇంకొందరైతే ఓ బర్రెను కొనుకొచ్చి.. దానికి షెడ్డు కట్టి.. కుడ్తి పెట్టి.. పాలు పిండుకుందాం అని అంటారు ఇంకొందరు. ఇలా అనుకునే కొందరు ఏదైనా మనం సొంతంగా చేసుకోవాలని.. స్వయం సమృద్ది సాధించే దిశగా ముందడుగు వేస్తుంటారు. ఈ కోవలోనే ఓ వ్యక్తి మాల్‌ను మార్కెట్‌లో కొనుక్కుంటే పైసలు ఖర్చు అవుతాయని.. ఏకంగా ఇంటి పెరట్లోనే ప్రయోగాత్మకంగా గంజాయి చెట్ల సాగు చేశాడు.. సీన్ కట్ చేస్తే.!
ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా IDA బొల్లారం పీయస్ పరిధిలో బొల్లారం పట్టణంలో బైక్‌పై తరలిస్తున్న 98 గ్రాముల ఎండు గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన రాయ్ భార్మలాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు IDA బొల్లారంలో నివాసం ఉంటుండగా.. అతడి నివాసం దగ్గర ఓపెన్ ప్లేస్‌లో యదేచ్చగా గంజాయి సాగు చేస్తున్నట్టు ఖాకీలు గుర్తించారు. మొత్తంగా 19 గంజాయి మొక్కలను బర్మాలల్ ఇంటి దగ్గర నుంచి తీసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై NDPS కేసు నమోదు చేసి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు