ఒకే వేదికపై పీర్లు, వినాయకుడు..!

|

Sep 06, 2019 | 5:09 PM

భారత దేశం భిన్నకులాలు, విభిన్న మతాలకు నెలవు..అయినప్పటికీ చాలా చోట్ల కుల మతాల కోట్లాటలు ఎక్కువయ్యాయి. కులాలు, మతాల పేరుతో మనుషులు విడిపోయి బ్రతుకుతున్నారు. ఎవరి దేవుడు వారికి సపరేటుగా ఏర్పాటు చేసుకుని ..వేర్వేరుగా పండగలు జరుపుకుంటున్నారు. కానీ, జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం అర్సపల్లి గ్రామస్తులు మాత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ సారి వినాయక ఉత్సవాలు, పీర్ల పండగ ఒకేసారి రావటంతో..గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలబడి ఓ నిర్ణయానికి వచ్చారు. హిందూ, ముస్లింల ఐకమత్యం చాటేలా […]

ఒకే వేదికపై పీర్లు, వినాయకుడు..!
Follow us on

భారత దేశం భిన్నకులాలు, విభిన్న మతాలకు నెలవు..అయినప్పటికీ చాలా చోట్ల కుల మతాల కోట్లాటలు ఎక్కువయ్యాయి. కులాలు, మతాల పేరుతో మనుషులు విడిపోయి బ్రతుకుతున్నారు. ఎవరి దేవుడు వారికి సపరేటుగా ఏర్పాటు చేసుకుని ..వేర్వేరుగా పండగలు జరుపుకుంటున్నారు. కానీ, జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం అర్సపల్లి గ్రామస్తులు మాత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ సారి వినాయక ఉత్సవాలు, పీర్ల పండగ ఒకేసారి రావటంతో..గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలబడి ఓ నిర్ణయానికి వచ్చారు. హిందూ, ముస్లింల ఐకమత్యం చాటేలా ఒకే చోట రెండు పండగలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు గణేష్‌ మండపంతో ఉత్సవాలు నిర్వహిస్తూ…మరోవైపు మొహర్రం వేడుకలు జరుపుకుంటున్నారు. పీర్లను, వినాయకుడిని ఒకే వేదికపై ఉంచి, మధ్యలో తెరను ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఉత్సాహంగా రెండు పండగలను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒకే వేదికపై రెండు మతాలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలిసిమెలిసి ఐక్యంగా పండుగను నిర్వహించేందుకే ఇలా ఏర్పాటు చేశామని గ్రామస్తులు బెబుతున్నారు.