హైదరాబాద్,అక్టోబర్11; ఎన్నికల తేదీ వచ్చేసింది.. ఊరువాడ, పల్లెపట్టణం తేడా లేకుండా పార్టీల జెండాలు రెపరెపలాడబోతున్నాయి.. మైకుల మోతలతో ప్రచారం ఊపందుకుంటోంది.. ఏ పార్టీ ప్రచారమైనా మస్ట్ గా ఉండేటివి ప్రచార వాహానాలే.. అధికార పార్టీ..ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రతి పార్టీ ఎన్నికల ప్రచారాలతో గెలుపు బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరగనున్న ప్రచార రధాలకు డిమాండ్ పెరిగింది. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల నేతలు ప్రచారం షురూ చేసారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎక్కడ చూసిన ప్రచార వాహనాలు రేడి అవుతున్నాయి..దీంతో సిటీ లోని కార్పెంటర్స్, ఫ్లెక్సీ డిజైనర్స్, ఆర్టిస్ట్ లు ప్రచారపు వాహనాల తయారీలో బిజీ అయ్యారు..
అసెంబ్లీ ఎన్నికలు కావడంతో లోకల్ పార్టీ నుండి సెంట్రల్ పార్టీ దాకా ప్రతి ఒకరు తమ స్థాయి లో జోరుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు.. ఇప్పటికే సిటిలోని అనేక చోట్ల చాలమంది కార్మికులు ప్రచార వాహనాలను రెడీ చేసే బిజీలో పడ్డారు..దాదాపు ఒక వాహనాన్ని రెడీ చేయడానికి ఐదు ఆరు గంటల సమయం పడుతుందని అంటున్నారు కార్పేంటర్స్.. ఓటర్లు అట్రాక్ట్ అయ్యే విధంగా పార్టీ రంగులు..పథకాలు..నాయకుల పేర్లతో ప్రచార రథాలు సిద్దం చేస్తున్నట్టుగా చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ ప్రచార వాహనాలను సిద్ధం చేస్తున్నారు..
ఇలా రెడీ అయినా వాహనాలకు మంచి డెకరేషన్ చేసి మైక్ సెట్ ను ఫిక్స్ చేసి ఫ్లెక్సీలను కడుతారు…ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో డిజిటల్ ఫ్లెక్సీలకు మార్కేట్లో డిమాండ్ ఉండటంతో డిజిటల్ బ్యానర్లు..ఫ్లెక్సిలను ప్రచార రథాలకుఅమరుస్తున్నారు. కొన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా మరికొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించపోయినప్పటికీ.. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ కొందరు నేతలు ప్రచార రథాలను సిద్దం చేసుకుంటున్నారు.. ఎది ఎమైనా ఎలక్షన్ పుణ్యమా అని రెండు చేతులా పనిదోరికిందంటున్నారు కార్మికులు.
ఈ బండ్ల పైన ఎలక్షన్ తేదీ ని తమ పార్టీ గుర్తు ను హైలెట్ చేస్తారు..ఎక్కువగా డీసీఎం , గూడ్స్ ఆటోలోనే ప్రచారం చేస్తారని.. ఒక్కో అభ్యర్థి నాలుగు నుండి ఐదు ప్రచార రథాలను తయారు చేయించుకుంటన్నారంటున్నారు ప్రచార రథాల తయారీ దారులు..క్యాండిట్లకు స్పేషల్ గా వారి పార్టీ అమలు చేసిన సంక్షేమపథకాలు..అధికారంలోకి వస్తే కొత్తగా అమలు చేసే పథకాలను వాహనాలపై కనిపించేల ఒక వాహనం.. కళకారులు ఆట పాటలకు మరో వాహనం సిద్దం చేస్తునామంటున్నారు ఇలా ఒకే సారి బల్క్ గా అర్డర్స్ వస్తునాయంటున్నారు వాహనాల తయారీ దారులు.
ప్రచార వాహనాలతో పాట ఫ్లేక్సీలకు..కండువాలకు..జేండు..టోపిల పార్టీ వస్త్రాలకు ఫుల్ డిమాండ్ మార్కట్లో కనిపిస్తుంది..హైదరాబాద్ నుండి అన్ని జిల్లాలకు వాహనాలను రేడీ చేసి పంపిస్తున్నారు పార్టీల నేతలు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..